మాస్ లో చొచ్చుకుపోవాలన్న ప్రయత్నాల్లో భాగంగా ‘సరైనోడు’ సినిమాతో ఓ అడుగు ముందుకేసి అల్లు అర్జున్ తర్వాతి సినిమా కోసం పలువురు దర్శకులతో సంప్రదింపులు జరుపగా హరీష్ శంకర్ తో అవి ఫలించాయి. ఫలితంగా ‘దువ్వాడ జగన్నాధం’గా ముస్తాబవుతున్నాడు ఈ అల్లువారి పిల్లగాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు దర్శకుల కోసం దేవులాడిన బన్నీ ఇప్పుడు హీరోయిన్ల వేట కొనసాగిస్తున్నాడట.
తొలుత ఈ సినిమాలో పూజ హెగ్డే, శృతి హాసన్ లలో ఒకరిని బన్నీ సరసన నటింపజేయాలనుకున్నా వారిద్దరి సమాధానం నో అనే వచ్చింది. కడకు ఈ అవకాశం తొలిగా మెగా హీరోయిన్ కిరీటం అందుకున్న కాజల్ అగర్వాల్ ని వరించిందని తెలుస్తోంది. మరో ముద్దుగుమ్మకు అవకాశముందో లేక వేరే కారణమో గానీ ఇంకా హీరోయిన్ల ఎంపిక జరుగుతోందట. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న మంజిమ మోహన్ తో సహా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో ఆకట్టుకున్న మెహరీన్ ని చిత్ర బృందం సంప్రదించారట. మెహరీన్ ఎంపిక ఖాయమన్నట్టు వినికిడి. దీనిపై అల్లు వారి మాటేమిటో మరి..!