సినిమాలు లేకపోయినా ఈ భామలు గ్లామర్ తో సందడి చేస్తూనే ఉన్నారుగా..!

సినిమాల్లోనే హీరోయిన్లు గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు అనేది ఇది వరకటి మాట.ఇప్పుడలా కాదు సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూనే ఉంటున్నారు. ఏదో ఒక ఫోటో షూట్ క్లిక్ అయ్యి..అవి వైరల్ అయ్యి ఫాలోవర్స్ పెరిగితే.. అవి దర్శకనిర్మాతల వరకూ వెళ్లి అవకాశాలు రాకపోతాయా అనేది వారి అభిప్రాయం. అందుకే కొందరు భామలు నెట్టింట్లో గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. వారెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ఇలియానా : గోవా బ్యూటీ ఇలియానా చేతిలో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు. లవ్ ఫెయిల్యూర్ అవ్వడం ఫలితంగా ఈమె డిప్రెషన్ కు వెళ్లిపోయి వెయిట్ పెరిగిపోవడంతో.. ఈమెను దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ వర్కౌట్లు చేసి సన్నబడి.. హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది.

2)పూనమ్ బాజ్వా : ‘మొదటి సినిమా’ ‘బాస్’ ‘పరుగు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ కూడా ఇప్పుడు తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాకు వేడెక్కిస్తుంది.

3)నిషా అగర్వాల్ : ‘ఏమైంది ఈవేళ’ ‘సోలో’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన కాజల్ చెల్లి నిషా.. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందేమో.. కొద్దిరోజుల నుండీ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. పెళ్ళై పిల్లాడు ఉన్నప్పటికీ ఈమె గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొనడం విశేషం.

4)ఆదా శర్మ : నితిన్- పూరి జగన్నాథ్ ల కాంబోలో వచ్చిన ‘హార్ట్ అటాక్’ చిత్రంతో అలరించిన ఈ బ్యూటీ తరువాత సరైన పాత్రలు ఎంపిక చేసుకుని సక్సెస్ అందుకోవడంలో విఫలమయ్యింది. ‘కల్కి’ వంటి సినిమాలో నటించినా ఈమెకు విజయం దక్కడం లేదు.. అవకాశాలు రావడం లేదు. అందుకే గ్లామర్ ఫోటో షూట్లు, రకరకాల ఫీట్లు చేస్తున్న వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

5)నేహా శర్మ : ‘చిరుత’ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘కుర్రాడు’ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం గ్లామర్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. రీ ఎంట్రీ ఇవ్వడానికే అనుకుంట..!

6)సోనాల్ చౌహాన్ : బాలయ్య నటించిన ‘లెజెండ్’ ‘డిక్టేటర్’ ‘రూలర్’ వంటి చిత్రాలతో అందాలు ఆరబోసిన సోనాల్ చౌహాన్ కూడా అవకాశాలు కరువవ్వడంతో గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేస్తుంది.

7)విమలా రామన్ : ‘ఎవరైనా ఎపుడైనా’ ‘చట్టం’ ‘గాయం2’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విమలా రామన్ కూడా హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంది.

8)సోనియా అగర్వాల్ : ‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది.

9)రెజీనా : అప్పట్లో క్రేజీ హీరోయిన్ గా కుర్రకారు మదిని దోచిన ఈ అమ్మడు కూడా వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

10)అనూ ఇమ్మాన్యుయల్ : మొదటిసినిమా నుండే పెద్ద పెద్ద ఆఫర్లు అందుకుంటూ వచ్చిన ఈ అమ్మడు.. ఈమధ్య కాలంలో ఆఫర్లు లేక అవస్థలు పడుతుంది.అయితే గ్లామర్ ఫొటోలతో మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus