వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్న హీరోయిన్స్

  • October 14, 2017 / 01:14 PM IST

నటిగా చిత్ర సీమలోకి అడుగు పెట్టిన తర్వాత ఏ చిత్ర పరిశ్రమలో విజయం వరిస్తే అక్కడే పాతుకుపోవడం పాతకాలం పద్ధతి. ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటి భామలు మూడు నాలుగు భాషల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లోకి సైతం వెళ్లి అక్కడి వారికీ పలకరించి మరీ వస్తున్నారు. ఈ విధానం అటు రెమ్యునరేషన్ విషయంలోనూ, ఇటు పాపులారిటీ లోనూ బాగా ఉపయోగపడుతోంది. అందుకే ఈ తరం హీరోయిన్స్ ఎక్కువమంది ఈ బాటను ఎంచుకుంటున్నారు.

రాశీఖన్నా ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నాబాలీవుడ్ మీదుగా టాలీవుడ్ కి వచ్చింది. చిన్న హీరోల సరసన నటించే ఈ భామ స్టార్ హీరోల పక్కన డ్యూయెట్ కి సిద్దమయింది. ‘జై లవ కుశ’ తో మంచి హిట్ సొంతం చేసుకుంది. తెలుగులో బిజీ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో చేసేందుకు ఓకే చెప్పింది.
తమిళంలో సిద్ధార్థ్ హీరోగా చేస్తోన్న “సైతాన్ క బచ్చా”తో పాటు “ఇమ్మక్కా నోడగల్ ” లో నటిస్తోంది. ఇది కాకుండా మలయాళంలో మోహన్ లాల్ “విలన్” సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది.

సమంత కెరీర్ మొదటి నుంచి తెలుగు తో పాటు తమిళ సినిమాలు చేస్తున్న సమంత.. పెళ్లి తర్వాత కూడా అదే జోరు కొనసాగించనుంది. ఇప్పుడు ఈమె చేతిలో తెలుగు, తమిళ భాషలు కలుపుకొని ఎనిమిది సినిమాలు ఉన్నాయి. మరో నాలుగు సినిమాలు చేసేందుకు కథ చర్చలు సాగుతున్నాయి.

నివేదా థామస్నివేదా థామస్ నాని “జెంటిల్ మ్యాన్” సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. తర్వాత జై లవకుశ వంటి భారీ చిత్రాల్లో అవకాశాలను అందుకుంది. ఈమె తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది. అయితే ఈ భామ తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్తో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. ఇక్కడ కూడా ఆ రేంజ్ సొంతం చేసుకుంది.

మెహ్రీన్ కౌర్పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ “కృష్ణగాడి వీరప్రేమగాథ”తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో రాజా ది గ్రేట్, సన్నాఫ్ సూర్య వంటి సినిమాలు చేస్తూ హిందీ, తమిళ భాషా చిత్రాల్లో నటిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్వరుస విజయాలతో రకుల్ ప్రీత్ సింగ్ లక్కీ హీరోయిన్ గా పేరుతో పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ స్పైడర్ ద్వారా కోలీవుడ్ లోను అడుగుపెట్టింది. రకుల్ ఇక్కడ బిజీగా ఉన్న తమిళంలో ఒకటి, హిందీ లో ఒక్కో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

కీర్తి సురేష్“నేను శైలజ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పడేసిన ఈ సుందరి, నేను లోకల్ మూవీతో యువత హృదయాల్లో తిష్టవేసుకొని కూర్చుంది. “మహానటి” సావిత్రిగాను మెరవబోతోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో జోడి కట్టింది. తమిళం లోను ‘తానా సీరేంధ కోటమ్’లో సూర్య సరసన నటిస్తోంది.

రెజీనాటాలీవుడ్ అనేక సినిమాలు చేసిన రేజీనాకి కలిసి రాలేదు. దీంతో తమిళ, కన్నడ భాషలపై దృష్టి పెట్టింది.
ప్రస్తుతం రెజీనా తమిళంలో మూడు, కన్నడలో ఒక సినిమా చేస్తోంది. అలాగని తెలుగును వదులుకోలేదు. “బాలకృష్ణుడు”లో నారా రోహిత్ తో మరోసారి జోడి కట్టింది.

ఏ ఎండకు ఆ గొడుగు అని పెద్దలు చెప్పిన మాటని బాగా వంటపట్టించుకొని నేటి తారలు ట్రెండ్ ని ఫాలో అవుతూ నాలుగు పైసలు వెనకవేసుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus