ఇప్పుడు ‘బాహుబలి’, ‘ఆర్.ఆర్.ఆర్’… అప్పట్లో ఈ 10 సినిమాలే భారీ బడ్జెట్ సినిమాలు..!

  • March 24, 2022 / 07:15 PM IST

సినిమాకి బడ్జెట్ అనేది కథ డిసైడ్ చేయాలి. కథ లేకుండా హీరో మార్కెట్ మీద ఆధారపడి సినిమాలు చేస్తే అవి విజయం సాధిస్తాయి అని చెప్పలేము. అయితే ఇప్పుడు కొత్త కథలు అనేవి పుట్టుకురావడం కష్టం. చాలా వరకు కథనం పైనే సినిమా రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. మంచి కథ తీసుకున్నా కథనం ఆసక్తికరంగా మలచకపోతే అప్పుడు కూడా విజయం సాధించడం కష్టమైపోతుంది. ఇప్పుడైతే కథ కంటే కథనం పైనే దర్శకుడు ఆధారపడాలి.. ఆ కథనానికి అనుగుణంగా నిర్మాత బడ్జెట్ పెట్టే విషయంలో ప్లాన్ చేసుకోవాలి. తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు బాగా పెరిగింది.’ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమా రూ.500 కోట్లు బడ్జెట్ తో నిర్మించబడింది అంటే అంతా షాక్ అవుతున్నారు.

ఇక్కడి నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టడానికి ఏమాత్రం వెనుకాడరు అనడానికి ఇది నిదర్శనం. అయితే ఆ విషయంలో మన తెలుగు నిర్మాతల తర్వాతే ఎవ్వరైనా. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది కాబట్టి భారీ బడ్జెట్ పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు మన నిర్మాతలు అనుకోవడం తప్పే. 1970′ ల నుండే వారికి ఈ దూకుడు ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.వారికి సినిమా పై గల ప్యాషన్ అలాంటిది. ఆ రోజుల్లో రూ.10 లక్షల బడ్జెట్ పెడితే అది భారీ బడ్జెట్ అనుకునేవాళ్లు, 80లలో రూ.50 లక్షలు ఆ పైన బడ్జెట్ పెడితే అది గ్రేట్ అనుకునేవాళ్ళు. అలా అప్పటి రోజుల్లో టాప్ 10 భారీ బడ్జెట్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) దాన వీర శూర కర్ణ :

దివంగత ముఖ్యమంత్రి మరియు ఒకప్పటి స్టార్ హీరో నందమూరి తారక రామారావు గారు నటించి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రం అప్పటి రోజుల్లో రూ.10 లక్షల భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

2)అల్లూరి సీతారామ రాజు :

ఆ రోజుల్లో ఈ చిత్రం రూ.25 లక్షల భారీ బడ్జెట్ తో రూపొందింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఓ క్లాసిక్ గా నిలిచింది. కృష్ణ గారి సొంత బ్యానర్లోనే ఈ మూవీ నిర్మితమైంది.

3) తాండ్రపాపారాయుడు :

కృష్ణంరాజు, జయప్రద జంటగా నటించిన ఈ మూవీని దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు గారు ఏకంగా రూ.1.5 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.

4) సింహాసనం :

కృష్ణ గారిని డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని ఎందుకంటారో… ఈ సినిమా బడ్జెట్ ను బట్టి చెప్పొచ్చు. ఆయనే నటించి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ మూవీకి ఏకంగా ఆ రోజుల్లోనే రూ.3.5 కోట్ల బడ్జెట్ అయ్యింది.

5)ఆదిత్య 369 :

బాలకృష్ణ- సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.1.52 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై అనిత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

6) అమ్మోరు :

సౌందర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ మూవీని ఆ రోజుల్లో రూ.1.8 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.

7)జగదేక వీరుడు అతిలోక సుందరి :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీని కె.రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించగా అశ్వినీదత్ గారు ఏకంగా రూ.9 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

8) దేవి పుత్రుడు :

వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని యం.యస్.రాజు గారు రూ.14 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ సినిమా మాత్రం ప్లాప్ అయ్యి నష్టాల్ని మిగిల్చింది.

9) మృగరాజు :

చిరంజీవి- గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీని కె.దేవి వర ప్రసాద్ గారు రూ.15 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యి నష్టాల్నే మిగిల్చింది.

10) అంజి :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోసియో ఫాంటసీ మూవీని రూ.18 కోట్ల భారీ బడ్జెట్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యి నిర్మాతకి నష్టాల్నే మిగిల్చింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus