సమంత సినిమాకి షాక్.. కాపీ కొట్టినందుకేనా?

పెళ్ళైన తర్వాత కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతుంది అక్కినేని కోడలు సమంత. తెలుగు, తమిళంలో ఇప్పుడు సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’, ‘సూపర్ డీలక్స్’ ‘ఓ బేబీ’ వంటి వరుస బ్లాక్ బూస్టర్లతో దూసుకుపోతుంది. అయితే 2013లో ‘ఓ బేబీ’ డైరెక్టర్ నందిని రెడ్డి తోనే ‘జబర్ధస్త్’ అనే చిత్రం చేసింది సమంత. ఈ చిత్రం ప్లాప్ గా మిగిలింది. అయితే ‘జబర్ధస్త్’ సినిమాకు సంబంధించిన డీవీడీలు, వీసీడీలు, బ్లూరే డిస్క్స్ ఫార్మాట్లలో రిలీజ్ చేయడం…. టీవీల్లో ప్రసారం చేయడం వంటివి చేయకూడదని హైకోర్టు ఈ చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేసింది.

ఈ చిత్రాన్ని ‘సాయి గణేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం 2010లో బాలీవుడ్లో వచ్చిన రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ ల ‘బ్యాండ్ బాజా బారాత్’ కు కాపీ అని తేల్చేశారు. కానీ .. యశ్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఇదే చిత్రాన్ని అప్పటికే నానితో ‘ఆహా కళ్యాణం’ గా మొదలు పెట్టేసారు. ‘ఆహా కళ్యాణం’ కంటే ముందు ‘జబర్ధస్త్’ విడుదల కావడంతో పెద్ద వివాదాలే చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ‘జబర్ధస్త్’ సినిమా ఏ ఫార్మాట్లో కూడా ప్రసారం చేయకూడదని ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus