స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ స్టడీగా రాణిస్తుంది. 10వ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ అన్ సీజన్ లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ తన హవా చూపిస్తుండడం.. సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది ప్రూవ్ చేసింది. ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సమంత యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసింది అనే టాక్ వచ్చినప్పటి నుండి.. కొందరు ఓటీటీకి ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తితో ఎదురుచూడటం మొదలుపెట్టారు. డిసెంబర్ 9 నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇన్సైడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి.కానీ ఇప్పుడు యశోద ఓటీటీ రిలీజ్ కి కోర్టు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ‘యశోద’ మూవీలో ఇవా హాస్పిటల్ నేపథ్యంలో కథ రన్ అయినట్టు చూపించార.
ఇప్పుడు ఇదే యశోద కి చిక్కులు తెచ్చిపెట్టింది. అది ఆ హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతినేలా ఉందని.. ఇవా యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘యశోద’ లో నేరుగా హాస్పిటల్ పేరు చూపించారు..సినిమా చూసినప్పుడే ఈ అనుమానం చాలా మందికి వచ్చింది కానీ.. అందుకు పర్మిషన్ వంటివి ఉన్నాయేమో అని అంతా భావించారు.
కానీ ఇవా హాస్పిటల్ వారు లేటుగా ఈ విషయం పై రియాక్ట్ అయినట్టు స్పష్టమవుతుంది. దీంతో యశోద ప్రొడక్షన్ కు కోర్టు నోటీసులు పంపడం జరిగింది.ఈ క్రమంలో డిసెంబర్ 19 వరకు ‘యశోద’ ని ఓటీటీలో రిలీజ్ చేయకూడదు. తదుపరి విచారణ డిసెంబర్ 19 కి వాయిదా వేశారని సమాచారం.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!