‘ధూమ్ ధామ్’ వీడియో సాంగ్ లో నాని కంటే ఆ కుర్రాడే హైలెట్ అయ్యాడట!

  • March 24, 2023 / 10:47 AM IST

నేచురల్ స్టార్ నాని అద్భుతమైన నటుడు. టాలీవుడ్లో ఉన్న హీరోల్లో తన యాక్టింగ్ తో సినిమా గట్టెక్కించగల అతి తక్కువ మంది హీరోల్లో ఇతను కూడా ఒకడు. అందుకే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ సెల్ఫ్ మేడ్ స్టార్ అయ్యాడు.నిర్మాతగా కూడా మంచి సినిమాలు అందిస్తున్నాడు. తన వాల్ పోస్టర్ బ్యానర్ ను సక్సెస్ ఫుల్ బ్యానర్ గా నిలబెట్టాడు. అయితే నానికి ఓ మైనస్ ఉంది. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే.అదే డాన్స్.!

నాని.. డాన్స్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు. ఈ విషయాన్ని నాని కూడా ఒప్పుకున్నాడు. పలు సందర్భాల్లో ఓపెన్ గానే చెప్పాడు కూడా..! అయినప్పటికీ ఏదో ఒక రకంగా మేనేజ్ చేసేస్తాడు. పైగా అందరి హీరోలు డాన్స్ బాగా చేస్తారు అనేమీ లేదు కూడా..! కానీ నానిలో ఉన్న ఇంకో మైనస్ ఏంటంటే.. ఓ సాంగ్ లో అతనితో పాటు మరో హీరో కూడా చిందేస్తున్నాడు అంటే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. నాని నటించిన ‘దసరా’ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

అందులో భాగంగా నిన్న ఈ చిత్రంలో చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలిచిన ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ వీడియో సాంగ్ ను నిన్న ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 42 సెకన్ల నిడివి గల ఈ వీడియో సాంగ్.. అందరినీ హుషారెత్తించే విధంగా ఉందని చెప్పాలి. చాలా మాస్ గా ఉండడంతో అందరికీ కనెక్ట్ అయ్యింది. అయితే హీరో నాని కంటే కూడా అతని పక్కన ఉన్న కుర్రాడు సూపర్ గా ఎనర్జిటిక్ గా డాన్స్ చేశాడు అంటూ కొంతమంది కామెంట్లు పడుతున్నారు.

నాని మాత్రం పట్టి పట్టి చేశాడని, కొంచెం ఇబ్బందులు ఫీల్ అయ్యాడని అంటున్నారు. ఇక నాని పక్కన డాన్స్ చేసిన ఆ కుర్రాడు పేరు దీక్షిత్ శెట్టి. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘దియా’ సినిమాలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అలాగే తెలుగులో కూడా ‘ముగ్గురు మొనగాళ్ళు'(2021) ‘ది రోజ్ విల్లా’ వంటి సినిమాల్లో నటించాడు. ‘దసరా’ ట్రైలర్ లో కూడా ఇతను హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఇతని పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక దీక్షిత్ కు తెలుగులో ఆదరణ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus