Allu Arjun: ఆన్ స్టాపబుల్ షోలో బన్నీ చెప్పిన సంగతులు ఏమిటో చూసేయండి!

Advertisement

ఆన్ స్టాపబుల్ నాలుగో సీజన్ 4 మొదలై ఇప్పటికి మూడు ఎపిసోడ్లు విడుదలైనా.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం బన్నీ(Allu Arjun) ఎపిసోడ్ కోసమే. నిజానికి మొదట షూటింగ్ అయిన ఎపిసోడ్ ఇదే. ఈ ఎపిసోడ్ ఇవాళ (నవంబర్ 15) నుంచి ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏమిటి అనేది చూద్దాం..!!

Allu Arjun

ఎపిసోడ్ ను బాలయ్య (Balakrishna) సమరసింహా రెడ్డి గెటప్ లో వచ్చి ప్రేక్షకుల్ని అలరించాడు. అలాగే.. ఆడియన్స్ లో ఒక అమ్మాయితో అందాల ఆడబొమ్మ పాటకి డ్యాన్స్ చేసి అందరికీ మంచి ఎనర్జీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బన్నీ (Allu Arjun) స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఏమిటో చూడండి.

సుకుమార్ కి నేషనల్ అవార్డ్ రావాలని ముందే అడిగా..

నా నేషనల్ అవార్డ్ అందరు తెలుగు హీరోలకి అంకితం..

మహేష్ బాబు ఒక ఫాప్ తర్వాత ఇచ్చే కం బ్యాక్ అదిరిపోతుంది..

పవన్ కళ్యాణ్ ధైర్యం మరెవరో చూడలేదు..

ఆరడుగుల బంగారం ప్రభాస్.. క్రిస్మస్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు

బాలీవుడ్ లో ఒన్నాఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్

మా నాన్న పర్స్ లో డబ్బులు కొట్టే చాన్స్ ఎప్పడు రాలేదు

మా అయాన్ గాడు యానిమల్ లో రణబీర్ కపూర్ లాంటోడు.. డాడీ కోసం ఏమైనా చేస్తాడు, మమ్మీ కోసం డాడీని కూడా వదలడు

మా ఆవిడ దగ్గర నా ప్రేమకథలు నేనేమీ దాయలేదు

ప్రెజెంట్ జనరేషన్ హీరోల్లో విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడివి శేష్ లను బాగా ఇష్టం

నా ప్రెజంట్ ఫేవరెట్ హీరోయిన్ రష్మిక

నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ విషయంలో నేను నెం.1

ఇండస్ట్రీలో నాతో నాకే పోటీ

మా నాన్న కొనిచ్చిన కారు తోలడం కంటే ఎక్కువగా తోయాల్సి వచ్చింది

40వ పుట్టినరోజుకి నా స్నేహితులు ఓ 60 మందితో కలిసి బెల్ గ్రేడ్ వెళ్ళాం. అక్కడ రభస రచ్చ రంబోలా చేసాం.

గోవాలో నా క్లోజ్ ఫ్రెండ్ సందీప్ రామినేనికి మందు కొనడం కోసం షాప్ కి వెళ్ళాను. ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది.

అనంతరం అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మల వేదిక పంచుకున్నారు.. ఆమె చెప్పిన విశేషాలు..

14 ఏళ్ల వయసు వరకు అల్లు అర్జున్ ని చూసి వీడు ఏమవుతాడా అని అందరం భయపడేవాళ్లం. 14 ఏళ్ల తర్వాత వాడిని చూసి వీడేనా వాడు అనిపిస్తుంది.

ముగ్గురిలో నా ఫేవరెట్ కొడుకు బన్నీ.

బన్నీ ఏదైనా ఒకసారి ఫిక్స్ అయితే.. ఎవరి మాట వినడు

చిరంజీవిగారి శతదినోత్సవ వేడుకలు చూసినప్పుడల్లా.. బన్నీ హీరో అయితే బాగుండు అనిపించేది.

ఈ ఎపిసోడ్ ను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు ఆహా బృందం. రెండో పార్ట్ లో బన్నీ పిల్లలు అయాన్ & అర్హ వచ్చారు. ఆ ఎపిసోడ్ విశేషాలు ఆ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక మళ్లీ మీకు అందిస్తాం.

 ‘పుష్ప 2’ లో ఆ ఫైట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus