Pushpa 2: ‘పుష్ప 2’ లో ఆ ఫైట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

అల్లు అర్జున్ (Allu Arjun)  హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’  (Pushpa 2)  పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ (Pushpa)  2021 డిసెంబర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 3 ఏళ్ళ నుండి అల్లు అర్జున్ అభిమానులను ఊరిస్తూ వస్తున్నాడు దర్శకుడు సుకుమార్. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరో 3 వారాల్లో ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpa 2

ఇక ఈ సినిమాకి బజ్ పెరగడంలో గంగమ్మ తల్లి జాతర ఫైట్ గ్లింప్స్ కారణం అని చెప్పాలి. ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్.. వంటి వాటిల్లో ఎక్కువగా వీటినే హైలెట్ చేస్తూ వచ్చారు మేకర్స్. అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ వెనుక కాస్త పెద్ద కథే ఉంది అనేది ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే..

‘పుష్ప 2’ లో గంగమ్మ తల్లి జాతర ఫైట్ హైలెట్ గా నిలుస్తుందట. ఈ ఒక్క ఫైట్ కోసం చిత్ర బృందం రూ.75 కోట్లు ఖర్చు చేసింది అని ఇన్సైడ్ టాక్. చిత్రీకరణ కోసం రూ.60 కోట్లు. రిహార్సల్స్ కోసం ఇంకో రూ.15 కోట్లు ఖర్చు అయ్యిందట. సినిమాలో ఈ ఫైట్ 15 నిమిషాలు ఉంటుందట. కేవలం పావుగంట సేపు మాత్రమే ఉండే ఈ ఫైట్ ని..

రెండు నెలలు షూట్ చేశారట. అలాగే 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు.. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం పనిచేసినట్టు టాక్. ఈ ఫైట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్ వేసి.. అక్కడే చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఫైట్ కి అభిమానులు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus