Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, గాయకుడు టిమ్‌ కర్రీ (80) కన్నుమూశారు. 2012 నుండి అనారోగ్యంతో వీల్‌ చైర్‌కే పరిమితమైన టిమ్‌ కర్రీ లాస్‌ ఏంజిలెస్‌లోని తన ఇంట్లోనే ఇటీవల మరణించారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లు, సిట్‌కామ్, వాయిస్‌ పాత్రలు, కార్యక్రమాలతో హాలీవుడ్‌ పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. స్టేజీ ప్లే, వెండితెరపై ప్రతినాయక పాత్రలు, ఐకానిక్‌ సెటైరికల్‌ పాత్రలతో ప్రేక్షకాదరణ పొందారు టిమ్‌ కర్రీ.

Tim Curry

ఇంగ్లాండ్‌లోని చెషైర్‌లో పుట్టిన ఆయన ‘హెయిర్‌’ అనే సినిమాలో పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాయల్‌ షేక్‌స్పియర్‌ కంపెనీ, రాయల్‌ కోర్ట్‌ థియేటర్‌ వారి నాటకాల్లో చోటు దక్కించుకున్నారు. రాయల్‌ కోర్ట్‌ థియేటర్‌లో ప్రదర్శించిన ‘ది రాకీ హారర్‌ పిక్చర్‌ షో’కి ఎంపికయ్యారు. అందులో ట్రాన్సిల్వేనియన్‌ ఫ్రాక్‌-ఎన్‌-ఫర్టర్‌ పాత్రతో నాటక రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘ది షౌట్‌’, ‘యానీ’, ‘హోమ్‌ అలోన్‌ 2: లాస్ట్‌ ఇయర్‌ న్యూయార్క్‌’, ‘క్లూ’, ‘కాంగో’, ‘స్ట్రేంజ్‌ జర్నీ: ది స్టోరీ ఆఫ్‌ రాకీ హారర్‌’ తదితర సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు వేసి మెప్పించారు.

సినిమాల్లో నటించడంతోపాటు డబ్బింగ్‌ కూడా చెప్పేవారాయన. అలా ‘పీటర్‌ పాన్‌ అండ్‌ ది పైరేట్స్‌’ అనే సినిమాలో కెప్టెన్‌ హుక్‌ పాత్రకు గొంతు అందించినందుకు డై టైమ్‌ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. పెళ్లి చేసుకోని కర్రీ.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ ఏమీ తెలియకుండా చూసుకుంటూ వచ్చారు. తన జీవితం గురించి ఆయన చెప్పాలనుకున్న కొన్ని విషయాలను మాత్రం ‘వగబోండ్‌: ఎ మెమొర్‌’ అనే తన ఆత్మకథలో రాసుకొచ్చారు.

ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus