రెబల్ స్టార్ కోసం పనిచేయనున్న హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజీత్ కాంబినేషన్లో రానున్న మూవీ పనుల్లో వేగం అందుకున్నాయి. బాహుబలి చిత్రం తర్వాత డార్లింగ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో.. అందుకు తగ్గట్టుగా తర్వాతి చిత్రం ఉండాలని యువీ క్రియేషన్స్ వాళ్లు బడ్జెట్ ని 150 కోట్లకు పెంచారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న ఈ సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ నటులు, టెక్నీషియన్లను తీసుకుంటున్నారు. ఎక్కువభాగం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ని కంపోజ్ చేసేందుకు కెన్నీ బేట్స్ అనే హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియో గ్రాఫర్ ని సెలక్ట్ చేసుకున్నట్లు తెలిసింది.

పెరల్ హార్బర్, డై హార్డ్, ట్రాన్స్ ఫార్మర్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు  కెన్నీ పనిచేశారు. తొలిసారి ప్రభాస్ సినిమా కోసం యాక్షన్ సీన్స్ డిజైన్ చేయనున్నారు. జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ఫిల్మ్  ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. బహుబాలి కంక్లూజన్ తర్వాత సిద్దమవుతున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Prabhas Next Film With Two Bollywood Actress - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus