19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత హీరోగా కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ టైమ్లో ఆయన పోలిటికల్ ఎంట్రీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు తన కుమారుడు రామ్ చరణ్ డెబ్యూ మూవీ బాధ్యతని ‘స్టాలిన్’ ఆడియో వేడుకలో నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు పూరీ జగన్నాథ్..లకి అప్పగించారు. ఆ టైమ్..కి ‘పోకిరి’తో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టి పూరీ జగన్నాథ్ మంచి ఫామ్లో ఉన్నాడు.

19 Years For Chirutha

తర్వాత చేసిన ‘దేశముదురు’ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ‘చిరుత'(Chirutha) సినిమాపై అన్ని విధాలుగా భారీ బజ్ ఏర్పడింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

అంచనాలు మరింతగా పెరిగాయి.ఆ అంచనాల నడుమ 2007 సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ‘చిరుత’ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రామ్ చరణ్ ఫైట్స్, డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో ఆడియన్స్ ఎగబడి చూశారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి.. కమర్షియల్ సక్సెస్ అనిపించుకుంది.ఈ సెప్టెంబర్ 28కి ‘చిరుత’ రిలీజ్ అయ్యి 19 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.02 cr
సీడెడ్ 5.34 cr
ఉత్తరాంధ్ర 2.40 cr
ఈస్ట్ 1.64 cr
వెస్ట్ 1.58 cr
గుంటూరు 2.06 cr
కృష్ణా 1.62 cr
నెల్లూరు 1.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 2.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 25.19 cr

‘చిరుత’ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.18 కోట్లు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.25.19 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి ఈ సినిమా మొత్తంగా రూ.7.19 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డెబ్యూ హీరోల్లో రామ్ చరణ్ ‘చిరుత’ ఆల్ టైమ్ రికార్డులు సృష్టించి నెంబర్ 1 ప్లేస్ ను సొంతం చేసుకుంది.

‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus