Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఇక చాలు.. రెగ్యులర్‌ సినిమాలు ఇక చాలు అని అనుకున్నాడో.. లేక ఇలాంటి సినిమాలు కెరీర్‌కి ఉపయోగపడటం లేదు అని అనుకున్నాడో కానీ.. రామ్‌ పోతినేని ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. హీరోగా ఉంటూనే రైటర్‌ అయ్యాడు. ఇప్పుడు డైరక్టర్‌ కూడా అయ్యాడు. ఈ క్రమంలో ఇప్పుడు విలన్‌ కూడా అవుతున్నాడు అని తెలుస్తోంది. ఈ మేరకు కోలీవుడ్‌ వర్గాల్లో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే రామ్‌ చెన్నై ఫ్లైట్‌ ఎక్కేస్తాడు అని చెబుతున్నారు.

Ram POthineni

ఇక అసలు విషయానికొస్తే.. ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయడానికి రామ్‌ అంగీకారం తెలిపాడు అనేది లేటెస్ట్‌ రూమర్ల సారాంశం. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా ‘ధర్మన్‌’ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అందులోనే రామ్‌ పోతినేని ఓ కీలక పాత్ర పోషించనున్నాడట. అయితే ఆ పాత్ర హీరోకు అల్లుడని, సినిమాలో చాలాసేపు కీలకంగా ఉంటూ.. ఆఖరిలో చిన్న నెగిటివ్‌ టచ్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

‘ధర్మన్’ సినిమాను కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్ ఇటీవల పూర్తి చేశారు. చిన్న గ్యాప్‌ ఇచ్చి వెంటనే మరో షెడ్యూల్‌ స్టార్ట్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లోనే రామ్‌ పోతినేని సెట్స్‌లో అడుగుపెడతాడు అని చెబుతున్నారు. అయితే తమిళ సినిమాలకు వెళ్లి మన హీరోలు విలన్‌గా చేస్తే ఈ మధ్య కలసి రావడం లేదు. మరి రామ్‌కి ఏమవుతుందో చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో రజనీ కాంత్‌ కూతురిగా రాశీ ఖన్నా నటిస్తోంది. ఆమె లవర్‌ పాత్రలోనే రామ్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పొచ్చు. గతంలో వీరిద్దరూ ‘శివమ్‌’, ‘హైపర్‌’ సినిమాలో కలసి నటించారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తే హ్యాట్రిక్‌ అవుతుంది.

‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus