యంగ్ రెబల్ స్టార్ సినిమాకు పనిచేయనున్న హాలీవుడ్ టెక్నీషియన్లు
- November 28, 2016 / 06:28 AM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బహుబలి చిత్రంతో ఎనలేని క్రేజ్ వచ్చింది. పొరుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా డార్లింగ్ కి అభిమానులు ఏర్పడ్డారు. దీంతో అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ విస్తరించింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉన్న బాహుబలి కంక్లూజన్ మాత్రమే కాకుండా.. ఆ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాలు కూడా అనేక భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నారు.
ఎక్కువ భాగం దుబాయి లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ప్రభాస్ చేసే సాహసాలు జేమ్స్ బ్యాండ్ ని తలపిస్తాయట. అందుకోసం హాలీవుడ్ నిపుణులను డైరక్టర్ నియమించుకున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్‌తో యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు డిసైడ్ అయ్యారు. 150 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న సినిమాలో ఐ బ్యూటీ అమీ జాక్సన్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ కాగా, మరో సుందరి కోసం గాలిస్తున్నారు. హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించనున్న ఈ మూవీ డిసెంబర్ లో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. 2017 జనవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















