‘గీత‌గోవిందం’లో నాని కోసం రాసుకున్న రోల్ ఇదే

  • August 21, 2018 / 11:23 AM IST

ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మరో బ్లక్ బస్టర్ హిట్ కొట్టడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఆ అరుదైన ఘనతని విజయ్ దేవరకొండ తక్కువ సమయంలో సాధించారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం అద్భుత విజయాన్ని అందించింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఐదు రోజుల్లో 50 కోట్ల మెయిలు రాయిని దాటి దూసుకుపోతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్లు నిత్యా మీన‌న్‌, అను ఇమ్మానుయేల్ గెస్ట్ రోల్ పోషించారు. హీరో త‌న క‌థ‌ను నిత్య మీన‌న్‌కు చెప్పుకుంటాడు.

అటువంటి కీలకమైన పాత్రను హీరో చేస్తే బాగుంటుందని ముందు అనుకున్నారంటా. అనుకోవడమే కాదు నేచురల్ స్టార్ నాని తో వేయించాల‌ని చిత్ర బృందం భావించింది. అయితే ఆ త‌ర్వాత హీరో అబ్బాయికి కష్టాలను చెప్పుకోవడం కంటే అమ్మాయికి చెప్పుకుంటే కథకి మరింత ప్లస్ అవుతుందని చివరి నిముషంలో నిర్ణయం తీసుకోవడం నిత్యమీనన్ సంప్రదించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఒకే ఒక్క రోజు నిత్యా మీనన్ ఈ చిత్రం కోసం కేటాయించింది. ఆ ఒక్క రోజులోనే ఆమె సన్నివేశాలను పరుశురామ్ చక్కగా తెరకెక్కించి.. మంచి హిట్ సొంతం చేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus