వారసులు సినిమాల్లోకి రావడం సహజమే. అయితే అది ఎక్కువగా హీరోల నుండే ఉంటుంది. కొడుకులు, మేనళ్లులు, తమ్ముళ్లు అంటూ వస్తూనే ఉంటారు. ఇది ఏక్క ఇండస్ట్రీకో పరిమితం కాలేదు అనుకోండి. అయితే ఈ క్రమంలో హీరోయిన్ల నుండి ఇలాంటివి తక్కువగా ఉంటాయి. మహా అయితే చెల్లి వస్తుంది. సీనియర్ హీరోయిన్ అయితే కూతురు వస్తుంది. కానీ వాళ్ల కుటుంబాల నుండి తక్కువగా వస్తారు. అలా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ నుండి కొత్త అమ్మాయి హీరోయిన్గా వస్తోంది.
మ్యాచ్ చివర్లో ధోనీ వచ్చి సిక్సర్లు కొట్టి గెలిపించినట్టుగా, నా పాత్ర అప్పటిదాకా సాగిన కథనే మార్చేస్తుంది అంటూ సినిమా మీద, తన మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేసింది యువ కథానాయిక హ్రితిక శ్రీనివాస్. వీజే సన్నీ హీరోగా నటించిన ‘సౌండ్ పార్టీ’ సినిమాతో త్వరగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమెకి తొలి సినిమా కాకపోయినా కాస్త బజ్ ఉన్న సినిమా ఇదే. ఎందుకంటే ‘అల్లంత దూరాన…’ అనే సినిమాతో పరిచయమైంది (Hrithika) హ్రితిక.
సీనియర్ నటి ఆమని.. హ్రితికకు అత్త అవుతుందట. ఆమనిని చూస్తూ పెరగడంతో చిన్నతనం నుండే సినిమాల మీద ఆసక్తి పెరిగిందట. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో బాలనటిగా కూడా నటించింది. కథానాయికగా ఇది రెండో అవకాశం. అయితే తనకు ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని ఉందట. ఇక తెలుగులో తనకు నచ్చిన కథానాయిక సాయిపల్లవి అని, ఆమె పాత్రలంటే ఇష్టమని చెప్పింది. తాను కూడా నటిగా అలాంటి ప్రయాణమే చేయాలని ఉంది అని అనుకుంటోందట.
మరి ఫేవరెట్ హీరో ఎవరు అంటే.. నేచురల్ స్టార్ నాని పేరు చెప్పింది. అలా ఇద్దరు నేచురల్ యాక్టర్లను ఇష్టపడుతోంది అన్నమాట. సంజయ్ శేరి దర్శకత్వంలో రూపొందిన ‘సౌండ్ పార్టీ’ సినిమాను ఈ నెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూనే ఈ వ్యాఖ్యలు చేసింది. మరి సాయిపల్లవిలా స్టార్ స్థాయికి ఎదుగుతుందేమో చూడాలి.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!