టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ప్రభాస్ సినిమాలకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను 250 కోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని బోగట్టా.
కేవలం డిజిటల్ హక్కుల కోసమే నెట్ ఫ్లిక్స్ ఈ స్థాయిలో ఖర్చు చేసిందంటే ఒక విధంగా రికార్డ్ అనే చెప్పాలి. సాహో, రాధేశ్యామ్ ఆశించిన ఫలితాలను అందుకోకపోయినా ప్రభాస్ క్రేజ్ అణువంత కూడా తగ్గలేదని చెప్పడానికి ఆదిపురుష్ సినిమా బిజినెస్ వివరాలే సాక్ష్యమని ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. డిజిటల్ హక్కుల విషయంలో ప్రభాస్ కొత్త రికార్డ్ సృష్టించారని చెప్పవచ్చు. ఓం రౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ అని ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అంటే సందేహాలు అవసరం లేకుండా సినిమా హిట్ అని ఫిక్స్ కావచ్చని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పది కంటే ఎక్కువ భాషల్లో రిలీజ్ కానుంది. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ తెరకెక్కుతుండటంతో భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో నెట్ ఫ్లిక్స్ రేంజ్ మారిపోయిందనే సంగతి తెలిసిందే ఈ కారణం వల్లే భాషతో సంబంధం లేకుండా ఆదిపురుష్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా కావడంతో నెట్ ఫ్లిక్స్ ఖర్చు విషయంలో వెనుకాడలేదని బోగట్టా.
అయితే ఈ డీల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా రీచ్ ఉన్న ఓటీటీ కావడంతో నెట్ ఫ్లిక్స్ ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఓటీటీ హక్కులను కొనుగోలు చేస్తోంది.