ప్రభాస్ సాహో సినిమాలో హైలెట్ కానున్న యాక్షన్ సీన్!
- September 14, 2017 / 07:56 AM ISTByFilmy Focus
బాహుబలి తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ తిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. నిన్నటినుంచి అమీర్ పేటలో వేసిన ఇంటి సెట్ లో హీరోయిన్ శ్రద్ధ కపూర్, ప్రభాస్ పై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ అనంతరం చిత్ర బృందం దుబాయ్ కి వెళ్లనుంది.
అక్కడి ప్రఖ్యాత ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఒక సీన్ కోసం 25 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది. ఈ యాక్షన్ సీన్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరగనుందని సమాచారం. సినిమాలో ఈ ఫైట్ ఒక హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200 కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















