సుజీత్ కాంబినేషన్లో రానున్న మూవీలో ఫైట్ కోసం 30 కోట్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బహుబలి చిత్రంతో రేంజ్ మారిపోయింది. ఆయన సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగా నిర్మాతలు బడ్జెట్ ని పెంచుతున్నారు. బాహుబలి కంక్లూజన్ తర్వాత డార్లింగ్ చేయనున్న మూవీ బడ్జెట్ వందకోట్ల నుంచి 150 కోట్లకు చేరింది.  “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న ఈ  ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు.

యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నారు. ఎక్కువ భాగం దుబాయి లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ప్రభాస్ చేసే సాహసాలు జేమ్స్ బ్యాండ్ ని తలపిస్తాయని తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆకాశములో ఒక ఫైట్ ని సుజీత్ డిజైన్ చేశారట. సినిమాలో హైలైట్ గా నిలువనున్న ఈ ఒక్క  ఫైట్ కోసం 30 కోట్లు కేటాయించారు. విదేశీ స్టంట్ మాస్టారు,  ఫైటర్స్ సెలక్ట్ చేయడం కూడా జరిగిపోయిందని సమాచారం. చెబుతుంటేనే ఎంతో ఆసక్తికలిగిస్తున్న ఈ సీన్ తెరపైన ఇంక ఎంత  అద్భుతంగా ఉండబోతోందో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus