రామ్‌చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది అంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా అయితే ఈ సినిమా ఉంటుందా? లేదా? అంటూ మాటలు.. సినిమా టీమ్‌ను తూటాల్లా ఇబ్బంది పెట్టాయి. ఈ సినిమా ఉండదు అని కోరుకున్న వారికి క్లారిటీ ఇచ్చేలా.. సినిమా ఉంటుంది అని నమ్మిన ఫ్యాన్స్‌కి ఆనందం ఇచ్చేలా సినిమాను అనౌన్స్ చేసి.. కొబ్బరికాయ కూడా కొట్టేశారు.
ఆ తర్వాత సినిమా గురించి పెద్దగా సమాచారం అయితే రావడం లేదు. గత కొన్ని రోజులుగా వస్తున్న హీరోయిన్ పేరు, సంగీత దర్శకుడు పేరు మాత్రమే చర్చల్లో నడుస్తున్నాయి. తొలిసారి సినిమా గురించి కొన్ని అదనపు విషయాలు బయటకు వచ్చాయి. అవే ఈ సినిమా కథ, బడ్జెట్ లాంటి విషయాలు. ఎందుకంటే ఆ రెండు అంశాల్లో చాలా పెద్ద మేటర్ ఉంది. అందులో ఒకటి సినిమా కథ వయసు. ఈ సినిమా కథ లైన్‌ను మన లెక్కల మాస్టారు సుకుమార్ ఎనిమిదేళ్ల క్రితం అనుకున్నారట.
అంటే.. ‘రంగస్థలం’ సినిమా కంటే ముందే ఈ సినిమా లైన్‌ని సిద్ధం చేసుకున్నారన్నమాట. అప్పుడు అనుకున్న పాయింట్‌ని.. తన టీమ్‌తో కలసి ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని.. ఇప్పుడు సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు. ఇంకొన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చే జనవరిలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేస్తారట. ఇక మరో విషయం సంగతికొస్తే.. బడ్జెట్. ఈ సినిమా కోసం సుమారు రూ.500 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారట.
ఇప్పటికే ఈ సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉన్నా.. సెట్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఆలస్యమవుతోందని చెబుతున్నారు. సినిమా కోసం ఐదు సెట్స్ సిద్ధం చేస్తున్నారని.. అవయ్యాక సినిమా షూటింగ్‌ను ఫుల్ జోష్‌లో చేస్తారట. ఈ లోపు సినిమా హీరోయిన్, సంగీత దర్శకులను ఫిక్స్ చేసేస్తారట. హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి, సంగీత దర్శకుడిగా శాశ్వత్ సచ్‌దేవ్ ఫిక్స్ అయ్యారని టాక్.