Agent: ‘ఏజెంట్’ సోలో రిలీజ్ కష్టమే!

  • February 25, 2023 / 03:26 PM IST

అక్కినేని అఖిల్ కెరీర్ కి చాలా కీలకమైన సినిమా ‘ఏజెంట్’. ఇప్పటివరకు అఖిల్ హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అతడి నుంచి చివరిగా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. కానీ అఖిల్ ఇమేజ్ పెరగడానికి ఈ సినిమా సాయం చేయలేకపోయింది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘ఏజెంట్’ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

కచ్చితంగా ఈ సినిమాతో అఖిల్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరతాడని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలకు మిశ్రమ స్పందన వచ్చింది. యాక్షన్, హీరోయిజం విషయంలో ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్లు అనిపించడం కొందరికి నచ్చలేదు. అఖిల్ లాంటి యంగ్ హీరోని అంత వైల్డ్ గా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ యూత్, యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకోవాలంటే ఆమాత్రం ఉండాలని చిత్రబృందం అంటోంది.

ఏప్రిల్ 28న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఆ డేట్ కి వస్తే అఖిల్ కి పోటీ తప్పేలా లేదు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్2’ సినిమా అదే తేదీన రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. కొన్నిరోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. నటుడు కార్తి రీసెంట్ గా పెట్టిన ఒక ట్వీట్ లో ఏప్రిల్ 28న ‘పొన్నియిన్ సెల్వన్2’ రావడం ఖాయమని చెప్పారు.

‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 తెలుగులో పెద్దగా ఆడకపోయి ఉండొచ్చు. కానీ దీని గురించి రిలీజ్ టైంలో, ఓటీటీలో వచ్చినప్పుడు పెద్ద చర్చే జరిగింది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్ట్ 2ని భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తారు. తమిళంలో దీనికి పోటీగా మరో సినిమా రాదు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా సినిమాను ఎక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేస్తారు. ఈ పోటీని తట్టుకొని అఖిల్ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus