ఉత్తరాంధ్రలో బాహుబలి 2 రాబట్టే వసూళ్లపై అంచనా

  • February 21, 2017 / 07:49 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త లెక్కలను పరిచయం చేసిన సినిమా బాహుబలి : ది బిగినింగ్. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సష్టించిన ఈ అద్భుత కళాఖండం మనదేశం, పరదేశం అని తేడా లేకుండా అడుగుపెట్టిన చోటల్లా కలక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ పై అంచనాలు రోజురోజుకి పెరుగుతోంది. ప్రభాస్ డ్యూయల్ రోల్ తో మెప్పిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లు వసూలు చేస్తుందని డైరక్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధం కాకముందే 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బాహుబలి 2 ఉత్తరాంధ్రలోను కొత్త రికార్డులను నెలకొల్పుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ ఏరియాలో బాహుబలి బిగినింగ్ 9 కోట్లు వసూలు చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు 8 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ 10 కోట్లు రాబట్టి ఉత్తరాంధ్ర సినీపరిశ్రమకు మరో బలమైన కేంద్రంగా ఎదుగుతోంది. అందుకే బాహుబలి 2  ఈ ఏరియాలో 20 కోట్లు తప్పకుండా వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే అంతకంటే ఎక్కువగానే వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus