ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డౌట్ అదే..!

  • March 30, 2020 / 03:34 PM IST

ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ ఇంట్రడక్షన్ వీడియో సూపర్ సక్సెస్. రాజమౌళి తన స్థాయిని నిలబెట్టుకుంటూ ఎప్పటిలాగే ఊహించిన దానికి పదిరెట్లు అనుభూతి చరణ్ ఫ్యాన్స్ కి పంచారు. చరణ్ బేర్ బాడీ తో నిమిషానికి పైగా ఉన్న వీడియోలో రెచ్చిపోయాడు. చరణ్ పర్ఫెక్ట్ కర్వ్డ్ బాడీ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమానిని ఫిదా చేసింది. మెగా అభిమానులు చరణ్ ఫస్ట్ లుక్ వీడియోపై పూర్తి సంతృప్తి వ్యక్తపరిచారు.

నెక్స్ట్ ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరచాల్సిన బాధ్యత రాజమౌళిపై పడింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుగా కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదల కానుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటి నుండే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఐతే ఎన్టీఆర్ ఇంట్రో వీడియోపై అభిమానులలో ఓ సందేహం మొదలైంది.

అల్లూరి సీతారామరాజుగా చరణ్ ని చొక్కా లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో పరిచయం చేసిన రాజమౌళి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని ఎలా పరిచయం చేయనున్నాడు? అనే సందేహం వారిలో ఉంది. ఎన్టీఆర్ ని సైతం అదే విధంగా వీరలెవల్లో చూపించాలని వారు కోరుకుంటున్నారు. ఐతే ఎన్టీఆర్ ని చొక్కా లేకుండా బేర్ బాడీతో రాజమౌళి పరిచయం చేయకపోవచ్చు. ఆయన కొమరం భీం వాస్తవిక వస్త్ర ధారణ తలపాగా, పంచె, చొక్కాలో చూపించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి జక్కన్న ఎన్టీఆర్ చేత కూడా చొక్కా విప్పిస్తాడో లేదో.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus