‘2.0’ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ దెబ్బ

  • December 12, 2018 / 05:12 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘2.0’ చిత్రం ప్రస్తుతానికి మంచి కల్లెక్షన్లనే రాబట్టింది. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ‘2.0’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపు 72 కోట్ల పెట్టి కొన్నారు. అయితే 3డి కి మంచి కలెక్షన్లే వస్తున్నప్పటికీ 2డి థియేటర్లు ఫుల్స్ పడట్లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ చిత్రం 47.8 కోట్ల షేర్ ను వసూల్ చేసినట్టు సమాచారం. డబ్బింగ్ చిత్రాల్లో ఇదే హైయెస్ట్ చెప్పుకోవచ్చు. అయితే 72 కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి కనీసం 72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది . కానీ అది కష్టమే అని ట్రేడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి. నైజాంలో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయడంతో మంచి వసూళ్ళని రాబట్టింది.దాంతో కొంత నష్టం నుండి బయట పడే అవకాశం ఉంది కానీ ఆంధ్రాలో మాత్రం వసూళ్ళు రాబట్టలేకపోయింది. ఈ పరిణామాలతో యువి క్రియేషన్స్ , ఎన్వీ ప్రసాద్ లకు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నయట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus