హీరోయిన్స్ ను బేస్ చేసుకొని సినిమాను మార్కెట్ చేసుకోవడం అనేది రెగ్యులర్ గా జరిగేదే. అయితే.. కేవలం హీరోయిన్ గ్లామర్ అండ్ చరిష్మాను బేస్ చేసుకొని నవంబర్ 3న రిలీజవుతున్న చిత్రం “ఏంజెల్”. వెంకటేష్ హీరోగా నటించిన “ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు” చిత్రంలో జూనియర్ వెంకీగా నటించిన నాగ అన్వేష్ కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రానికి “బాహుబలి”కి అసిస్టెంట్ గా వర్క్ చేసిన పళని దర్శకుడు. ఆర్నెల్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పలుమార్లు పోస్ట్ పోన్ అయ్యి.. ఎట్టకేలకు నవంబర్ 3న విడుదలవుతోంది.
భారీ స్థాయి గ్రాఫిక్స్ కారణంగా సినిమాకి 30 కోట్ల రూపాయలపైనే ఖర్చు అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకనిర్మాతలే చెబుతుండడం విశేషం. ప్రమోషన్స్ వీరలెవల్లో చేస్తున్నప్పటికీ.. సినిమాపై కనీస స్థాయి క్రేజ్ రావడం లేదు. అదే తేదీన “గరుడ వేగ” కూడా రిలీజవుతుండడంతో “ఏంజెల్” ఆడే థియేటర్ల వరకూ జనాల్ని రప్పించడానికి సదరు సినిమా దర్శకనిర్మాతల దగ్గరున్న ఏకైక అస్త్రం హెబ్బాపటేల్ అందచందాలు మాత్రమే. మరి హెబ్బా అందాలు “ఏంజెల్” సినిమాకి ఎస్థాయి కలెక్షన్స్ తెచ్చిపెడతాయో చూడాలి.