Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Advertisement

మాస్ మహారాజా రవితేజ సినిమాలు ఏవీ కూడా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. ఫోర్స్డ్ కామెడీ, రొటీన్ కథలతో వచ్చిన రవితేజ గత సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి.

Irumudi

కనీసం డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టడంలోనూ ఫెయిల్ అయ్యాయి అని చెప్పాలి. అయితే ఎట్టకేలకు ఈ మాస్ హీరో తన పంథా మార్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఇరుముడి'(Irumudi) సినిమాతో మాస్ రాజా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.ఎమోషన్స్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేసే శివ నిర్వాణ.. ఈ యాక్షన్ డ్రామాను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారట. ఇందులో రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్నారు.

ఈ సినిమా నుండి హీరో ఫస్ట్ పోస్టర్ వదిలారు. దానికి ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. రవితేజ సినిమాకి రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో పాజిటివ్ టాక్ రావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో అజయ్ ఘోష్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.’మైత్రీ మూవీ మేకర్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వస్తోందట.

రిలీజ్ డేట్ ను ఆగస్టు 14కి ఫిక్స్ చేసినట్టు లేటెస్ట్ టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 21న నాని ‘ది పారడైజ్’ రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. కానీ అది మళ్ళీ పోస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసి.. ‘ఇరుముడి’ మేకర్స్ ఆగస్టు 14కి ఫిక్స్ అయినట్టు సమాచారం.

రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus