బాద్ షా బయ్యర్లను ముంచేశాడు..!

  • January 2, 2019 / 12:16 PM IST

2013 లో వచ్చిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసాడు బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌. ఈ చిత్రం పక్కన పెడితే చాలా సంవత్సరాలుగా ఒక్కటంటే… ఒక్క హిట్ కూడా సాధించలేకపోయాడు షారూఖ్‌. ఇక ఎన్నో అసలు పెట్టుకుని చేసిన ‘జీరో’ చిత్రం కూడా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ చిత్రంలో మరుగుజ్జుగా కనిపించి మెప్పించినప్పటికీ… సినిమా మాత్రం షారుఖ్ కి హిట్ మాత్రం ఇవ్వలేకపోయింది.

‘జీరో’ చిత్రంతో షారుఖ్ ఇమేజ్ కూడా జీరో అయిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘జీరో’ చిత్రం కొన్న పంపిణీ దారులు ఘోరంగా నష్టపోయారు. ఇన్ని డిజాస్టర్ లు పడినంత మాత్రాన మార్కెట్ ఏమి పడిపోయినట్టు కాదని భావించి బయ్యర్లు భారీ మొత్తం ఇచ్చి షారుక్ చిత్రాల్ని కొనుగోలు చేస్తున్నారు పంపిణీ దారులు. అందులోనూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ షారుఖ్ చిత్ర ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో ఉండక పోవడంతో.. షారుక్ ప్రయోగాలు కూడా వేస్ట్ అయ్యిపోతున్నాయి. ఒక పక్క సల్మాన్ ఖాన్ తో పాటు వరుణ్ ధావన్ వంటి హీరోలు దూసుకుపోతుంటే… షారూఖ్‌ గ్రాఫ్‌ మాత్రం ఇలా తగ్గిపోతుండడంతో… అభిమానులను తీవ్ర నిరాశకు గురవ్వుతున్నారు. షారుఖ్ ఎప్పటికి బ్లాక్ బస్టర్ ఇచ్చి వీళ్ళ దాహం తీరుస్తాడో.. చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus