ప్రియాంక అరుల్ మోహన్… దశ తిరిగింది..!

  • May 27, 2022 / 10:12 PM IST

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్. ఈ సినిమా విడుదల కాకుండానే బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది ఈ చెన్నై బ్యూటీ. విక్రమ్ కుమార్ సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారు…అలాగే వాళ్ళ నటనకి కూడా స్కోప్ ఉండేలా డిజైన్ చేస్తుంటాడు.అదే కోవలో ప్రియాంక కి కూడా మంచి పాత్రని ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు కూడా ప్రియానే..!

ఈ మూవీ రిలీజ్ టైములో యువతకి క్రష్ గా మారిపోయింది.సినిమాలో మంచి నటన కనపరిచింది కూడా..! కానీ సినిమా ఆడకపోయే సరికి ఈమెను దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు.కానీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ టైములోనే అమ్మడికి శ‌ర్వానంద్ తో `శ్రీ‌కారం` చేసే అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో టాలీవుడ్లో అమ్మడిని పట్టించుకున్నవాళ్లు లేరు. దీంతో తన సొంత గడ్డకే చేరుకుంది. శివ కార్తికేయన్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆమె హీరోయిన్ గా నటించిన డాక్టర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ఆ మూవీ తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. తర్వాత ఆమె నటించిన ‘ఈటి’ మూవీ తమిళ్ లో పెద్దగా ఆడలేదు కానీ తెలుగులో పర్వాలేదు అనిపించే విధంగా ఆడింది. ఇక తాజాగా విడుదలైన ‘కాలేజ్ డాన్’ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈమె దశ తిరిగినట్టు అయ్యింది. ఈ మూవీ తర్వాత అమ్మడికి రెండు తమిళ ప్రాజెక్టులు సెట్ అయ్యాయి. అందులో స్టార్ హీరో ధనుష్ ప్రాజెక్టు కూడా ఒకటని తెలుస్తుంది.

ఇక తెలుగు నుండీ కూడా ఈమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయట. కానీ మొదట్లో చేసిన తప్పు చేయకూడదని వాటిని అమ్మడు హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఫుల్ కాన్సన్ట్రేషన్ తమిళ్ ఇండస్ట్రీ పైనే పెట్టినట్లు తెలుస్తుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus