వయసుతో సంబంధం లేకుండా ఛాన్స్ అందుకుంటున్న హీరోయిన్స్!

హీరోలకి 60 ఏళ్ళు దాటినా.. పదహారేళ్ళ అమ్మాయితో డ్యూయెట్ పాడవచ్చు. హీరోయిన్లకు 30 ఏళ్లు దాటితే మాత్రం హీరోకి జోడీగా పనికిరారు. హీరోయిన్ గా రిటైర్ అయిపోవాల్సిందే?. అమ్మ, అక్క పాత్రలకి  మారాల్సిందే.. ఈ విధానాన్ని బీట్ చేస్తున్నారు నేటి స్టార్ హీరోయిన్స్ శ్రియ, త్రిష, అనుష్క, నయనతారలు. తమ అందం, అభినయంతో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు. ముప్పై దాటినా హీరోయిన్స్  గా  దూసుకుపోతున్నారు. ఎంతమంది అందగాతెలు వచ్చినప్పటికీ పదిహేనేళ్లకు పైగా హీరోయిన్లుగా కొనసాగుతోన్న శ్రియ, త్రిష, అనుష్క, నయనతారల జోష్ ని తగ్గించలేకపోతున్నారు. ఈ నలుగురిలో  రోజు రోజుకీ ఈ నలుగురిలో అందం మరింత పెరుగుతోందని ఫిలిం మేకర్స్ చెబుతున్నారు. అందుకే అవకాశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం శ్రియ తమిళంలో “నరగసూరన్‌”, తెలుగులో “వీరభోగ వసంతరాయలు” సినిమాలు చేస్తున్నారు. నయనతార సౌత్ ఇండియాలో బిజీ నటి అయ్యారు. ఆమె నటించిన ‘ఆరమ్‌’  త్వరలో రిలీజ్ కానుంది. “వేలైక్కారన్‌”, “ఇమైక్క నొడిగళ్‌”, “కొలయుదిర్‌ కాలమ్‌”, “కో కో” వంటి సినిమాల్లో నటిస్తూ నయనతార క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. అలాగే బాలకృష్ణ ‘జయసింహ’లో ఆమె హీరోయిన్‌. చిరంజీవి ‘సైరా’ కూడా చేస్తున్నారు. త్రిష, అనుష్కలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ద్రుష్టి పెట్టారు. అనుష్క “భాగమతి” కోసం కష్టపడుతుండగా, త్రిష ‘”1818’, ‘96’ సినిమాలు చేస్తున్నారు. ‘హే జ్యూడ్‌’ అనే చిత్రం ద్వారా మలయాళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు.  ఇంకా కొన్నేళ్లు చిత్రపరిశ్రమలో ఈ నలుగురు హీరోయిన్స్ గా కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus