Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్.. ఏమైందంటే?

చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై దాదాపుగా ఏడాది అయింది. చరణ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు తాజాగా గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని అందరూ భావించగా దిల్ రాజు మాత్రం ఈ సినిమా ఆ సమయానికి రిలీజ్ కాదని చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ సమయానికి ఈ సినిమా షూట్ పూర్తవుతుందని కామెంట్లు వినిపించగా డిసెంబర్ జనవరిలో మాత్రం సినిమా రిలీజ్ కాదని దిల్ రాజు చెప్పినట్టు తెలుస్తోంది. దిల్ రాజు సరైన డేట్ చూసి ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 సంక్రాంతి పండుగకు ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్ లు షెడ్యూల్ అయ్యాయి.

ఆ సినిమాలకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా దిల్ రాజు కొంతమేర నష్టపోవాల్సి వస్తుంది. దిల్ రాజు ఈ సినిమా కోసం ఖర్చుకు సంబంధించి ఏ మాత్రం రాజీ పడలేదని ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని బోగట్టా. చరణ్, అంజలి కాంబో సీన్లు ఎమోషనల్ గా సాగుతాయని తెలుస్తోంది. కియారా అద్వానీ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో చరణ్ (Ram Charan) హీరోగా నటించిన సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ టాలెంటెడ్, స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చరణ్ త్వరలో లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus