Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Reviews » Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 15, 2026 / 10:48 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆన్ష్ (Hero)
  • వాసవి గణేశన్ (Heroine)
  • సునీత, ప్రణి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరికంటి, అంజి వల్గుమెన్, రసూల్ యాదవ్ తదితరులు (Cast)
  • భిక్షు (Director)
  • వెంకట్ యాదవ్ (Producer)
  • చరణ్ అర్జున్ (Music)
  • రుద్ర సాయి (Cinematography)
  • మార్తాండ్ కె వెంకటేష్ (Editor)
  • Release Date : 15th ఆగస్టు 2026
  • రుద్ర క్రాంతి పిక్చర్స్ (Banner)

టీనేజ్ లవ్ స్టోరీస్ ను ఆధారం చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. ‘ప్రేమిస్తే’ వంటి సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి. ‘టెన్త్ క్లాస్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టాయి. మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా ‘హుషారు పిట్టలు’ అనే టీనేజ్ లవ్ స్టోరీ రూపొందింది. టీజర్ తో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ ఆగస్టు 15న పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ చిన్న సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైనదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి:

Hushar Pittalu Movie Review

Hushar Pittalu Movie Review And Rating

కథ: మాచినపల్లి రవి (ఆన్ష్) ఓ టాప్ స్టూడెంట్. అతని తల్లి సునీత (సునీత) ఎంతో కష్టపడి రవిని చదివిస్తూ ఉంటుంది. తండ్రి సత్తయ్య (రమేష్ నకిరెకంటి) పిల్లల బాగోగులు పట్టించుకోకపోయినా.. రవికి, అలాగే అతని తమ్ముడు వంశీకి ఎటువంటి లోటూ రాకుండా ఆమె అన్ని రకాల వసతులు సమకూరుస్తుంటుంది.మరోవైపు తాటికల్లు గీసే పాండుకి తన కూతురు చిట్టి (వాసవి గణేశన్) అంటే ప్రాణం. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న చిట్టిని పాండు ఎంతో గారాబంగా పెంచుతాడు. అయితే చిట్టికి లోకాకర్షణలు ఎక్కువ. మొబైల్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ ఆ విషయాలు తన కజిన్ శైలుతో(ప్రణి రెడ్డి) పంచుకుంటూ ఉంటుంది. అలాగే టాపర్ అయినటువంటి మాచినపల్లి రవిపై మనసు పారేసుకుంటుంది.

ఇక రవి టాపర్ అవ్వడం ఓర్చుకోలేని బాలన్న.. అతన్ని ఎలాగైనా చెడగొట్టాలని భావించి, రవికి అశ్లీల చిత్రాలు చూపించి పెడదారిన పడేలా చేస్తాడు. అలాగే ఎవరైనా అమ్మాయిని చూసుకుని జల్సాలు చేయమని సలహా ఇస్తాడు. ఈ క్రమంలో రవి, చిట్టితో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ చదువుని, పెద్దలను, పరువు ప్రతిష్టలను పక్కన పెట్టి.. పడకసుఖాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.ఒకరోజు రవి ప్రేమలో ఉన్నది తన చెల్లెలితోనే అనే షాకింగ్ విషయం బాలన్నకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు చిట్టి లోకాకర్షణలకి గురవ్వడానికి కారణం ఎవరు? రవి జీవితం ఏమయ్యింది? వీళ్ళ కన్నవాళ్లు ఏమయ్యారు? అనేది మిగిలిన కథ.

Hushar Pittalu Movie Review And Rating

నటీనటుల పనితీరు: సినిమాలో 95 శాతం నటీనటులు కొత్తవాళ్లే. ఆన్ష్ బాగా చేశాడు. వాసవి గణేశన్ కూడా బాగానే చేసినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో మరీ చిన్న పిల్లలా కనిపిస్తుంది. కథ కూడా అలాంటిదే కాబట్టి.. ఇంకొంతమందికి కన్వెన్సింగ్ గా అనిపించొచ్చు. హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన గోవర్ధన్ రెడ్డి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. మొదట నెగిటివ్ గా కనిపించిన ఈ పాత్ర.. తర్వాత అందరినీ ఎమోషన్ కి గురిచేస్తుంది. సునీత పాత్ర కూడా అంతే..! ప్రణి రెడ్డి సీరియస్ గా కనిపిస్తూనే కామిడీ పండించింది. హీరో తండ్రిగా చేసిన రమేష్ నకిరికంటి కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. తాత పాత్ర కూడా బాగా పేలింది.

Hushar Pittalu Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ట్రైలర్ చూస్తేనే ‘హుషారు పిట్టలు’ కథపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే టీజర్‌లో ‘ఆన్‌లైన్ క్లాస్’ డైలాగ్ అనేది హుక్ పాయింట్ అయిపోయింది. సినిమాపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ పడేలా చేసింది. అందుకు తగ్గట్టే ఫస్ట్ హాఫ్‌లో.. సినిమా సెటప్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. స్టార్టింగ్‌లో కథనం కొంచెం స్లోగా అనిపిస్తుంది. సాదాసీదాగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసి సెకండాఫ్.. ‘ఇలాగే ఉంటుందేమో’ అని ఆడియన్స్ ఓ అంచనాకి వచ్చేస్తారు.

కానీ అక్కడే దర్శకుడు కొంచెం వినూత్నంగా ఆలోచించాడు. కేవలం హీరో, హీరోయిన్ల కోణంలోనే కాదు, వారి తల్లిదండ్రుల కోణంలో కూడా ప్రేక్షకులు ఆలోచించేలా కొన్ని మంచి సన్నివేశాలు రాసుకున్నాడు. హీరోయిన్ ఫాదర్ ట్రాక్ కావచ్చు, హీరో మదర్ ట్రాక్ కావచ్చు.. అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. సెకండాఫ్‌లో హీరో తల్లి వద్దకి స్కూల్ టీచర్ వచ్చి మాట్లాడే సన్నివేశం ఒకటి ఉంటుంది. చెప్పుకోవడానికి ఇది సాదాసీదా సన్నివేశమే. కానీ అందులో చాలా లోతు ఉంటుంది. మీనింగ్‌ఫుల్‌గా అనిపిస్తుంది. తర్వాత వచ్చే సీన్స్ కూడా అందరికీ కనెక్ట్ అవుతాయి.

బాలన్న పాత్ర కావచ్చు, శైలు పాత్ర కావచ్చు, హీరోయిన్ తండ్రి పాత్ర, హీరో తల్లిదండ్రుల పాత్రలతో అంతర్లీనంగా కొన్ని మెసేజ్‌లు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు దర్శకుడు భిక్షు. అయితే హీరో, హీరోయిన్ రోజూ కలుసుకునే సన్నివేశాలు వంటివి కొన్ని లాజిక్‌లెస్ అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ కూడా ఇన్‌కంప్లీట్‌ ఫీలింగ్ అనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల కారణంగానే ఆ సన్నివేశాలు అలా తీశారేమో. ఇక చరణ్ అర్జున్ మ్యూజిక్ బాగుంది. నేపథ్య సంగీతం కథనం నుండి డీవియేట్ కాకుండా బాగానే కుదిరింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నిర్మాణ విలువలు కొంత మైనస్‌గానే అనిపిస్తాయి.

Hushar Pittalu Movie Review And Rating

విశ్లేషణ: ‘హుషారు పిట్టలు’ రెగ్యులర్ గా మొదలవుతుంది. నిబ్బా-నిబ్బీ..ల ప్రేమకథేనేమో అనిపిస్తుంది. కానీ సెకండాఫ్లో కొన్ని మంచి సన్నివేశాలు ఉండటం వల్ల, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. నిర్మాణ విలువలు, క్లైమాక్స్ కనుక బెటర్ గా ఉండుంటే.. ఈ సినిమా స్థాయి మరోలా ఉండేది. ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకి బెటర్ రెస్పాన్స్ రావొచ్చు. కానీ థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..!

Hushar Pittalu Movie Review And Rating

ఫోకస్ పాయింట్: ‘హుషారు’ లోపించిన ‘పిట్టలు’

రేటింగ్: 2.25/5

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ansh
  • #Bikshu
  • #Hushar Pittalu Movie
  • #Marthand K Venkatesh
  • #Vasavi Ganeshan

Reviews

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

4 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

17 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

17 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

18 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

14 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

15 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

16 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

18 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version