Hyper Aadhi, Manchu Vishnu: మంచు విష్ణును దారుణంగా ట్రోల్ చేసిన ఆది?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి విష్ణు ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే. ఎంతో శ్రమించి ‘మా’ అధ్యక్షునిగా ఎన్నికైన విష్ణు ‘మా’ అభివృద్ధి కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు మంచు విష్ణుకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మంచు విష్ణు తెలుగు భాష గురించి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే ఈటీవీ ఛానెల్ లో దీపావళి పండుగ రోజున తగ్గేదేలే పేరుతో ఈవెంట్ ప్రసారం కానుండగా ఈ ఈవెంట్ లో విష్ణును టార్గెట్ చేస్తూ హైపర్ ఆది సెటైర్లు వేశారు.

మంచు విష్ణు చెప్పిన డైలాగులను ఇమిటేట్ చేసి ఆది పంచ్ లు వేయగా అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది రోజాతో అన్నీ మీకు తెలిసినట్టు మాట్లాడతారేంటి.. ఇందాక ప్రియమణి గారు మా సైడ్ వచ్చి ఏం మాట్లాడారో తెలుసా.. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ ఆది కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఈ ఈవెంట్ లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయిందని గెటప్ శ్రీను అంకుల్ ఉంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవాడని ఆది అన్నారు.

మీకసలు గుడివాడ రహాలబేత్తా గురించి తెలుసా అంటూ ఆది పంచ్ లు వేశారు. బయట ఒక పది మంది ఎప్పుడూ నన్ను పొగుడుతూ ఉంటారని వాళ్ల పేర్లు నేను చెప్పనని కావాలంటే బయటకు వెళ్లి అడగాలని ఆది కామెంట్లు చేస్తారు. హైపర్ ఆది ఈవెంట్ లో వేసిన పంచ్ ల గురించి విష్ణు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus