ప్రభాస్ తో కలిసి నటించడం చాలా సంతోషం : అరుణ్ విజయ్
- August 26, 2017 / 02:16 PM ISTByFilmy Focus
యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలుగుతో పాటు హిందీ నటీనటులను తీసుకున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తుండగా, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు ప్రభాస్ తో తలపడనున్నారు. ఇక కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ను ఓ కీలక రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలిసింది. తమిళంలో అనేక చిత్రాలు చేసిన అరుణ్, బ్రూస్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇప్పుడు సాహో తో దగ్గరకాబోతున్నారు. ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చినందుకు అరుణ్ ఆనందంగా ఉన్నారు. “ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని ట్వీట్ చేశారు. ఇతను కూడా షూటింగ్ లోకి త్వరలో జాయిన్ కానున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















