యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ టాలీవుడ్ లో రికార్డులను తిరగ రాస్తోంది. హిట్ డైరెక్టర్ కొరటాల శివ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అత్యంత వేగంగా 50, 100 కోట్ల క్లబ్ లో చేరిన తెలుగు సినిమా(నాన్ బాహుబలి) గా చరిత్ర సృష్టించింది. అయితే ఈ రికార్డులను చూసి తారక్ పొంగి పోవడం లేదు.
అసలు తాను రికార్డ్స్ గురించి పట్టించుకోనని చెప్పారు. మంచి సినిమాని చూశామని తృప్తి తో థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటికి వెళ్లాలనేదే తన కోరికని ఎన్టీఆర్ వెల్లడించారు. ఆలా జరిగినప్పుడు నేనే కాదు, మా చిత్ర యూనిట్ సంతోషిస్తోందని వివరించారు. జనతా గ్యారేజ్ విజయం మా టీమ్ మొత్తానికి ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తర్వాతి సినిమా బాగా రావాలని కష్టపడుతానని యంగ్ టైగర్ చెప్పారు. అంతే గాని పొంగి పోవడం, కుంగి పోవడం ఉండదని స్పష్టం చేశారు.