తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగువల్ గా రామాయణంలోని శూర్పణక పాత్ర నేపధ్యంలో ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు భార్గవ్ అనే దర్శకుడు సమాయత్తమవుతున్నట్లు వార్తలొచ్చాయి. సదరు పాత్రను కాజల్ పోషించనున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. కట్ చేస్తే.. కాజల్ ప్లేస్ లోకి సమంత వచ్చిందని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుందని మరికొన్ని కథనాలు వచ్చాయి.
ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది సమంత. అసలు తన వద్దకు “శూర్పణక” స్క్రిప్ట్ తో ఎవరూ రాలేదని, కనీసం ఫోన్ ద్వారా కూడా ఎవరూ అప్రోచ్ అవ్వలేదని చెప్పుకొచ్చింది సమంత. సమంత ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమా యాక్సెప్ట్ చేయబోనని చెప్పిందట. సో, ఆ సినిమా పూర్తయ్యేవరకూ సమంత తదుపరి చిత్రం ఏమిటనే విషయంపై క్లారిటీ రాదు.