Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Reviews » I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 10, 2026 / 09:30 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పృథ్వీరాజ్ సుకుమారన్ (Hero)
  • పార్వతీ తిరువోతు (Heroine)
  • హకీమ్ షాజహాన్, అశోకన్, విజయ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్ తదితరులు (Cast)
  • నిస్సాం బషీర్ (Director)
  • ముఖేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి (Producer)
  • జేక్స్ బిజోయ్ (Music)
  • దినేష్ పురుషోత్తమన్ (Cinematography)
  • రమీస్ ఎం బి (Editor)
  • Release Date : 10th జూలై 2026
  • E4 ఎక్స్పెరిమెంట్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ (Banner)

మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది మలయాళ చిత్రాల గురించే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తుండటంతో, ఆయన సినిమాలకు ఇక్కడ మరింత డిమాండ్ పెరిగింది అని చెప్పాలి. ఈ జూలై 10న ఆయన హీరోగా నటించిన ‘ఐ నో బడీ’ సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై రామ్ పెదనాన్న రవి కిషోర్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం రండి:

I Nobody Movie Review

I Nobody Movie Review And Rating

కథ: ​రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతని భార్య మీరా (పార్వతి తిరువోతు) కూడా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే రాజీవ్, మీరాల మధ్య సఖ్యత ఉండదు. ఏదో ఒక విషయంలో వారు నిరంతరం గొడవ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో, మీరా ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌తో ఎఫైర్ పెట్టుకుందని రాజీవ్‌కు తెలుస్తుంది. అప్పటి నుండి అతను మానసికంగా కుంగిపోతాడు.

​ఒకరోజు ఈ విషయమై ఆ బ్యాంక్ మేనేజర్‌ను కలిసి వార్నింగ్ ఇవ్వాలని భావించి రాజీవ్ బ్యాంక్‌కు వెళ్తాడు. అయితే, అదే సమయంలో ఊహించని విధంగా ఆ బ్యాంక్‌కు నలుగురు దొంగలు వస్తారు. వారు రాజీవ్‌ను కిడ్నాప్ చేసి అక్కడ నుండి తప్పించుకోవాలని చూస్తారు. కానీ, వాళ్ల ప్లాన్ బెడిసికొట్టడంతో ఒక రోడ్డు ప్రమాదంలో ఆ దొంగలంతా మరణిస్తారు.అయితే, వారు దొంగిలించిన రూ. 17 కోట్ల డబ్బు ఆచూకీని మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతారు.

దీంతో ఆ దొంగల నుండి ఆ డబ్బుని రాజీవే కొట్టేసి ఉంటాడని అందరూ అనుమానిస్తారు. పోలీసులు, అతని ఫ్లాట్‌లోని వారు, అలాగే ఆఫీస్‌లోని తోటి ఉద్యోగులు అంతా ఆ విషయమై రాజీవ్‌ను మానసికంగా వేధించడం మొదలుపెడతారు. ఇంకొందరైతే అతని నుండీ డబ్బు డిమాండ్ చేస్తూ దాడులు కూడా చేస్తారు.ఈ పరిస్థితుల వల్ల అతని భార్య మీరా… పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విడాకులు కోరుతుంది. ఆ తర్వాత రాజీవ్ జీవితం ఏ మలుపు తిరిగింది? అసలు ఆ దొంగలు దొంగిలించిన డబ్బు ఏమైంది? అనేదే మిగిలిన కథ.

I Nobody Movie Review And Rating

నటీనటుల పనితీరు: పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోతాడు అని ‘ ఐ నో బడీ ‘ సినిమా మరోసారి గుర్తుచేసింది. ఈ రోల్ చాలా టిపికల్ గా ఉంటుంది. అయినప్పటికీ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతో ఈజ్ తో చేసేశాడు. యాక్షన్ సీన్స్ లో అయితే చాలా నేచురల్ గా చేశాడు. పార్వతి తిరువోతు కూడా చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేసింది. పిల్లలు కూడా క్యూట్ గా పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా అమలగా చేసిన పాప పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అనస్ రోల్ చేసిన నటుడు, జాకబ్ గా చేసిన నటుడు కూడా బాగా చేశారు. మిగతా నటీనటులు ఓకె.

I Nobody Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: మలయాళ సినిమాల్లోని అసలు మ్యాజిక్ ఏంటంటే.. కథ కంటే స్క్రీన్ ప్లే, టెక్నికల్ టీమ్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం. అక్కడి సినిమాల్లో కథా గమనం అంతా ప్రీ-క్లైమాక్స్‌లోనే మొదలవుతుంది, కానీ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడం వారి ప్రత్యేకత. ‘ఐ నో బడీ’ సినిమానే తీసుకుందాం.

ఇందులో కూడా ఫస్ట్ హాఫ్‌లో అసలు కథ ఏంటనే దానిపై స్పష్టత ఉండదు, కానీ ప్రేక్షకుడు ఆ స్క్రీన్ ప్లేని బాగా ఎంజాయ్ చేస్తాడు. లిఫ్ట్ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ సెకండాఫ్ పై ఎక్సైట్‌మెంట్‌ని పెంచుతాయి. అయితే, కీలకమైన సెకండాఫ్ మాత్రం డల్‌గా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ తేలిపోయింది. హీరో మరియు అతని ఫ్యామిలీ ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు, హీరో ఒక స్టెప్, హీరోయిన్ ఇంకో స్టెప్ తీసుకుంటారు. చివరకు వాళ్ళని కాపాడటానికి ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగడం రియాలిటీకి దూరంగా ఉంటుంది. అసలు ఆ డబ్బు ఏమైంది అనే పాయింట్ కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది. క్లైమాక్స్‌లో కేవలం డబ్బును చూపించి ముగించేశారు.

ప్రాపర్ కన్క్లూజన్ లేదు.దీనివల్ల ఫస్ట్ హాఫ్‌లో క్రియేట్ అయిన ఎక్సైట్‌మెంట్ అంతా తగ్గిపోయింది. అయినప్పటికీ, మిగతా సాంకేతిక విభాగం అందించిన మంచి అవుట్‌పుట్ సినిమా స్థాయి పడిపోకుండా కాపాడింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కూడా ఓకే.

I Nobody Movie Review And Rating

విశ్లేషణ: ‘ ఐ నో బడీ ‘ ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో లాజిక్ లెస్ సీన్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మిస్ అవ్వడంతో యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోతుంది.

ఫోకస్ పాయింట్: హాఫ్ బేక్డ్ థ్రిల్లర్

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #I Nobody Movie

Reviews

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

24 mins ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

9 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

10 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

8 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

9 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

9 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

21 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version