గ్లామర్ షో అంటే.. స్కిన్ షో కాదు : తాప్సి

  • November 30, 2020 / 10:07 PM IST

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సి .. ఇక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. వరుసగా అక్కడ కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకుంది తాప్సి. అక్కడ ఈమె సినిమాలకు మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఇటీవల తాప్సి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని గ్లామర్ షో గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..

“నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొన్ని సినిమాల కోసం బికినీ ధరించడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఓకే చెప్పేసేదాన్ని. కానీ పర్సనల్ గా నాకు అంత ఇష్టం ఉండేది కాదు.నా అభిమానులు‌ కూడా నన్ను బికినీలో చూడడానికి ఇష్టపడేవారు కాదు. అందంగా కనిపించడమంటే స్కిన్ షో చెయ్యడం కాదు అని నా ఫీలింగ్.ఆ తరువాత స్కిన్ షో విషయంలో నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను. బికినీ నాకు సౌకర్యంగా ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది.

అటు తరువాత తన ఫస్ట్‌ లవ్‌ గురించి మాట్లాడుతూ.. మొదటి ప్రేమ ఎప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకమే.! నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా క్లాస్ మేట ను ఇష్టపడ్డాను. అతను కూడా నన్ను ఇష్టపడేవాడు. కానీ తరువాత చదువుకి ఇబ్బంది కలుగుతుందని మాట్లాడడం మానేశాడు. ఆ రోజుల్లో మొబైల్‌ ఫోన్లు ఉండేవి కాదు… దాంతో పబ్లిక్‌ ఫోన్‌ నుండీ అతనికి ఓసారి ఫోన్‌ చేసి బాగా ఏడ్చేశాను” అంటూతాప్సి చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus