ఈమధ్య హీరోయిన్లు బాగా ముదిరిపోయారు. అందుకే కెరీర్ తొలినాళ్లలోనే ఏమీ దాచుకోకుండా అంగాంగ ప్రదర్శనలకు కొందరు సిద్ధమవుతుంటే.. ఇంకొందరు హీరోయిన్ గా కంటే నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతూ అందుకు స్టార్ స్టేటస్ లను కూడా పణంగా పెడుతున్నారు. ఆ జాబితాలో తాను చేరతానంటోంది మహేష్ బాబు “ఒన్ నేనొక్కడినే” చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సైజ్ జీరో సుందరి కృతి సనన్.
ఈ అమూల్ బేబీ కెరీర్ ప్రారంభంలోనే మహేష్ బాబు, షారుక్ ఖాన్ వంటి బడా హీరోలతో కలిసి నటించే అవకాశం సొంతం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముట్టుకుంటే మాసిపోతుందేమో అనుకొనేంత అందంగా ఉండడంతోపాటు అదరగొట్టే యాక్టింగ్ టాలెంట్ కూడా సమపాళ్లలో కలిగిన ఈ సుందరీమణికి అర్జంటుగా హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టేసి నెగిటివ్ క్యారెక్టర్ చేయాలనుందని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు “ధోనీ” ఫేమ్ సుశాంత్ తో డేటింగ్ లో ఉందని టాక్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.