సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం తాను దత్తత తీసుకున్న తన స్వగ్రామం బుర్రిపాలెం ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ’ రాజకుమారుడు చిత్రీకరణ సమయంలో బుర్రిపాలెం వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తాను. శ్రీమంతుడు చిత్రీకరణ సమయంలో గ్రామాన్ని దత్తత తీసుకుందామని బావ గల్లా జయదేవ్ చెప్పారు.
అయితే అలా చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అందరూ అనుకుంటారు. అందుకే చిత్ర విడుదల తరువాత గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మాకు సహాయం చేస్తున్న ఆంధ్రా బ్యాంకుకు మరియు సిద్దార్థ కాలేజి లోని 200 మంది విద్యార్ధులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’నన్నారు. ఈ సందర్శనలో ఆయన పలువురికి హెల్త్ కార్డులు, ఇళ్ళ స్థలాలకు పట్టాలను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తుండగా.. మే 20 న ఈ చిత్రం విడుదల కానుంది.