ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సుధ. ఈమె సాధారణంగా మీడియాకి చాలా దూరంగా ఉంటారు. తొలి సారి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సుధ అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించారు. అందులో ఉదయ్ కిరణ్ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఉదయ్ కిరణ్ తనని ఎప్పుడూ అమ్మా అని పిలుస్తాడని చెప్పారు. ఏ సినిమా సంతకం చేసిన మొదట తనకే ఫోన్ చేసి చెప్పేవాడని, తన కూతురిని సొంత అన్నలాగా చూసుకొనేవాడని వివరించారు.
“మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు లోలోపల బాగా కుమిలి పోయేవాడు. ఒక సారి నా వద్ద బోరున ఏడ్చాడు. ఆ సమయంలో అతన్ని దత్తత తీసుకోవాలని అనుకున్నాను. పని ఒత్తిడిలో అప్పుడు కుదరలేదు” అని సుధ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అతని ఆత్మహత్య వార్త తనని బాగా కలిచి వేసిందని కన్నీరు పెట్టుకున్నారు. హృదయం గాయం పడిన సందర్భంలో ఉదయ్ కిరణ్ కి తల్లి లేని లోటుని తీర్చివుంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఒక హీరోని కోల్పోయేది కాదేమోనని సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.