2006 వ సంవత్సరంలో వచ్చిన ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత వచ్చిన ‘పోకిరి’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. అదే ఏడాది ‘ఖతర్నాక్’ ‘రాఖీ’ వంటి చిత్రాల్లో కూడా నటించింది ఈ అమ్మడు. అటు తర్వాత ‘మున్నా’ ‘ఆట’ ‘జల్సా’ ‘జులాయి’ వంటి చిత్రాలతో ఈమె బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే సడెన్ గా ఈమె తెలుగు సినిమాలు తగ్గించి బాలీవుడ్ కు చెక్కేసింది.
అక్కడ ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. పైగా ఓ విదేశీయుడితో ప్రేమలో పడి.. కెరీర్ ను నిర్లక్ష్యం చేసింది. అదే టైములో ఫిట్ నెస్ కూడా కోల్పోయింది. ఇదిలా ఉండగా.. ఓ టైములో ఈమె సూసైడ్ చేసుకోవాలని కూడా డిసైడ్ అయినట్టు తెలిపి షాకిచ్చింది ఈ అమ్మడు. అందుకు కారణం లవ్ ఫెయిల్యూర్ అనే కాదట. విషయంలోకి వెళ్తే.. ’12 ఏళ్ల వయసు నుండే నాకు శరీర సమస్యలు ఉన్నాయి.అందుకే అప్పట్లో సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను.
కానీ తర్వాత కొంత కాలం అయ్యాక.. అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా, అవసరమైన వాటిపైనే ఫోకస్ పెట్టాలని తెలుసుకున్నాను.కానీ కొంతమంది బాడీ షేమింగ్ వల్లే సూసైడ్ అటెంప్ట్ చేసానని రాసేశారు. అది తప్పు. ఆ వార్తలు చదివి నాకు చాలా చిరాకు వచ్చింది. అంటూ చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో ఈమె ఆఖరిగా రవితేజ- శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీతో మళ్ళీ ఈమె తెలుగులో బిజీ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అలాంటిది ఏమీ జరగలేదు.