గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని చాలా రహస్యంగా ఉంచినప్పటికీ తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మాత్రం సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు ఇలా పెళ్లి విషయాన్ని చెప్పకుండా ఏకంగా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పడంతో ఈమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు హల్చల్ చేశాయి.
ఇలా ఎప్పటికప్పుడు తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను అందరితో పంచుకొని ఇలియానా తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచారు. అయితే చివరికి తన ప్రియుడి ఫోటోని ఈమె రివిల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు అతనితో వివాహం అయిందా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు. ఇకపోతే ఇలియానా గత నెల మొదట్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.
ఈమె (Ileana) తాను మగ బిడ్డకు జన్మనిచ్చాను అనే విషయాన్ని ఏకంగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా తన కొడుకుకి కో ఫోనిక్స్ డోలన్ అని నామకరణం కూడా చేసినట్లు తెలిపారు. ఇలా అప్పటినుంచి ఇలియానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ పూర్తిగా తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ ఉన్నారు అయితే డెలివరీ తర్వాత మొదటిసారి ఇలియానా తన కొడుకుతో పాటు ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.
ఇలియానా బెడ్ పై తన కొడుకుతో పాటు పడుకొని తనకు ఫీడింగ్ ఇస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా డెలివరీ తర్వాత మొదటిసారి తన కొడుకుతో పాటు ఉన్నటువంటి ఫోటోని ఇలియానా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.