దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి గోవా ముద్దుగుమ్మ ఇలియానా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఓ వెలుగు వెలిగారు. ఇలా ఇండస్ట్రీలో ఒకప్పుడు బిజీ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇలియానా ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఇలియానా అందరికీ గత కొద్ది రోజుల క్రితం ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించారు.
తాను తల్లి కాబోతున్నానని తన బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా పెళ్లి కాకుండా ఇలియానా తల్లి కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ప్రేగ్నెన్సీ విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ఇలియానా తన బేబీ బంప్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా తన మాతృత్వపు క్షణాలను అనుభూతులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని ఈమె తాజాగా తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. కడుపులో బిడ్డ తనని తంతుందని… నిద్ర కూడా పట్టడం లేదు అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ప్రెగ్నెంట్ అయినటువంటి ఇలియానా తన ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే అనుభూతులన్నింటిని ఒక తీపి జ్ఞాపకాలుగా సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు.
అయితే నేటిజన్స్ మాత్రం ఇలియానా (Ileana) చేసినటువంటి పోస్టులపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఇలియానా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి చెబుతూ వస్తున్నప్పటికీ ఆ ప్రెగ్నెన్సీ కి కారణమైన వ్యక్తి గురించి మాత్రం దాచి పెడుతున్నారు. ఈ క్రమంలోనే కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు ఇప్పటికైనా చెప్పండి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.