మిరపకాయ్, గబ్బర్‌సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ చిత్రాలను తీసిన డైరక్టర్ హరీష్ శంకర్‌కు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం హరీష్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ షెడ్యూల్ గ్యాప్ లో మిత్రులతో కలిసి గురువారం వేరే ప్రాంతానికి వెళ్లానుకున్నారు. ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న హరీష్ శంకర్, మిత్రులను ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానంలోకి రానివ్వలేదు.
దానికి కారణం అడిగితే ఆలస్యంగా వచ్చారని, అందుకే విమానంలోకి ఎక్కనివ్వమని సిబ్బంది చెప్పినట్లు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ఇండిగో విమానాలు రెగ్యులర్‌గా ఆలస్యంగానే ప్రయాణిస్తుంటాయని, అయితే ప్రయాణికులు ఆలస్యమైతే మాత్రం విమానంలోకి అనుమతించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్ తో పాటు ఇండిగో విమానం లేటవుతోంది అని తెలిపే సమాచారం ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.