Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

‘చూడాలని వుంది’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ ‘ఇద్దరు మిత్రులు’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ‘అన్నయ్య’ తో హిట్టు కొట్టి కోలుకున్నప్పటికీ తర్వాత మళ్ళీ ‘మృగరాజు’ ‘శ్రీమంజునాథ’ ‘డాడీ’ వంటి ఫ్లాపులు ఆయన్ని రేసులో నుండి వెనక్కి నెట్టేశాయి. ఆ టైమ్లో ‘చిరంజీవి పని అయిపోయింది’ వంటి విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో ‘ఇంద్ర'(Indra) చేశారు చిరు.

Indra

ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్లో చిరంజీవి చేసిన మొదటి సినిమా ఇది. 2002 జూలై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ మొదటి రోజు మొదటి షోతోనే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

దీంతో సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. అప్పటివరకూ బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ పేరిట ఉన్న రికార్డులు అన్నీ బద్దలుకొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది ‘ఇంద్ర’ చిత్రం.నేటితో ఈ సినిమా విడుదలై 24 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న నేపధ్యంలో.. ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను పరిశీలిద్దాం రండి

నైజాం 7.15 cr
సీడెడ్ 6.25 cr
ఉత్తరాంధ్ర 2.70 cr
ఈస్ట్ 2.15 cr
వెస్ట్ 2.00 cr
గుంటూరు 2.42 cr
కృష్ణా 2.13 cr
నెల్లూరు 1.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 26.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.55 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 28.70 cr

‘ఇంద్ర’ చిత్రం రూ.18 కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.28.70 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్లకు రూ.11.70 కోట్ల లాభాలు అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి రీ రిలీజ్ లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus