Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో వచ్చిన ఎపిక్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ'(Tholi Prema) సినిమా కూడా తప్పకుండా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ టైమ్ కి ఇది ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ఎ.కరుణాకరన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.జి.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో 4వ సినిమాగా రూపొందింది ఈ చిత్రం.

Tholi Prema

అప్పటివరకూ అన్న చాటు తమ్ముడిగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఆ ఇమేజ్ కి దూరంగా ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. మొదట్లో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ 1998 జూలై 24న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత షో షోకి పాజిటివ్ రెస్పాన్స్ పెరుగుతూనే వచ్చింది. ప్రేమకథా చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమాగా ‘తొలిప్రేమ’ రికార్డులు తిరగరాసింది.నేటితో ‘తొలిప్రేమ’ విడుదలై 28 ఏళ్ళు పూర్తిక్వస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.97 cr
సీడెడ్ 1.52 cr
ఉత్తరాంధ్ర 1.04 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.51 cr
గుంటూరు 0.69 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.32 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.60 cr

‘తొలిప్రేమ’ చిత్రం కేవలం రూ.4.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.8.6 కోట్ల షేర్ ను రాబట్టి సంచలనం సృష్టించింది. బయ్యర్లకు రూ.4.33 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus