Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీ గురించి మనకు తెలియని రికార్డు..!

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీ గురించి మనకు తెలియని రికార్డు..!

  • April 3, 2021 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీ గురించి మనకు తెలియని రికార్డు..!

ఓ భాషలో హిట్టైన సినిమాని.. మరో భాషలోకి రీమేక్ చెయ్యడం అనేది కొత్తేమి కాదు. ఇప్పటివరకూ ఇతర భాషలకు చెందిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి ఘన విజయాలు సాధించాయి. అలాగే ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను ఎక్కువగా బాలీవుడ్లోకి రీమేక్ చేసుకుంటున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓకే సినిమాని ఎక్కువ భాషల్లోకి రీమేక్ చేస్తే అది ఒక రికార్డుగానే చెప్పుకోవాలి. గతంలో మహేష్ బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘పోకిరి’,రవితేజ- రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ‘విక్రమార్కుడు’.. వంటి సినిమాలు నాలుగైదు భాషల్లోకి రీమేక్ అయ్యి సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే ఇతర భాషల్లో 96,దృశ్యం వంటివి కూడా నాలుగైదు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అయితే ఇవి మాత్రమే రికార్డు అనుకుంటే పొరపాటే..! ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే తెలుగు చిత్రం ఏకంగా 9 భాషల్లోకి రీమేక్ అయ్యి సంచలనం సృష్టించింది.బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. 7 భారతీయ భాషల్లోకి అలాగే 2 విదేశీ భాషల్లోకి రీమేక్ అయ్యింది ఈ చిత్రం.

2005 వ సంవత్సరంలో సిద్దార్థ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేసాడు. ‘సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై యం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన అబ్బాయి… పేదరికంలో పుట్టి పెరిగిన అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ లైన్ తో అప్పటికే వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కానీ ఈ చిత్రం టేకింగ్ వాటికి పూర్తి భిన్నంగా అలాగే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఓ సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. లవ్, కామెడీ,సెంటిమెంట్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్ని రకాలుగాను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ చిత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఏ ఏ భాషల్లో రీమేక్ అయ్యిందో అలాగే అక్కడి టైటిల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1.తమిళంలో ఈ చిత్రాన్ని ‘ఉనక్కం ఎనక్కం’ పేరుతో రీమేక్ చేశారు.

2. కన్నడలో ఈ చిత్రాన్ని ‘నీనెల్లో నానల్లే’ పేరుతో రీమేక్ చేశారు.

3.బెంగాలీలో ఈ చిత్రాన్ని ‘ఐ లవ్‌ యు’ పేరుతో రీమేక్ చేశారు.

4.మణిపురిలో ఈ చిత్రాన్ని నింగోల్‌ తజబ పేరుతో రీమేక్ చేసారు.

5.ఒడియాలో ఈ చిత్రాన్ని ‘సునా ఛాదీ మో రూపా ఛాదీ’ పేరుతో రీమేక్ చేసారు.

6.పంజాబీలో ఈ చిత్రాన్ని ‘తేరా మేరా కీ రిష్తా’ పేరుతో రీమేక్ చేశారు.

7.హిందీలో ఈ చిత్రాన్ని ‘రామయ వస్తావయ’ పేరుతో రీమేక్ చేశారు.

8.బెంగాలీలో ఈ చిత్రాన్ని ‘నిస్సా అమర్‌ తుమీ’ పేరుతో రీమేక్ చేశారు.

9.నేపాలీలో ఈ చిత్రాన్ని ‘ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా’ పేరుతో రీమేక్ చేశారు.

మొత్తానికి రీమేక్ అయిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విజయం సాధించడం మరో విశేషంగా కాదు కాదు.. మరో రికార్డుగా చెప్పుకోవాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Archana
  • #Jayaprakash Reddy
  • #Nuvvostanante Nenoddantana
  • #Prakash Raj
  • #Siddharth

Also Read

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

related news

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

58 mins ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

2 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

20 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

20 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

3 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

3 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

3 hours ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

4 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version