టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్‌ది సెపరేట్ స్టైల్. సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు, కామెంట్లకు భలేగా సమాధానం ఇస్తుంటారు ఆ టీమ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో కానీ, ఇప్పుడు ‘ఓజీ’ సినిమా విషయంలో కానీ డీవీవీ ట్వీట్స్ హైలైట్. అయితే ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వార్ ఇప్పుడు ‘యానిమల్’ సినిమా విషయంలో జరిగింది. ఇక్కడ ట్వీట్ల తూటాలు వదులుకుంది ఆ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన ట్విటర్ హ్యాండిల్సే.
ఒకప్పుడు ట్విటర్ ఇప్పుడు ఎక్స్‌లో ‘యానిమల్’ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ నెటిజన్ ఓ పోస్ట్ పెట్టారు. దానికి ఓవైపు నుండి ‘యానిమల్’ టీమ్ ట్విటర్లో స్పందిస్తే… మరోవైపు నుండి ఆ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన మరో విభాగంగా ట్విటర్ హ్యాండిల్ రిప్లై ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతగా నెటిజన్ ఏమడిగారు అనేగా డౌట్.. జస్ట్ ఓ ఫొటో ఇవ్వమన్నారు అంతే.
‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్ ఒకరినొకరు సీరియస్‌గా చూసుకునే సీన్ ఉంది. దానిని ఓ పోస్టర్‌గా ఇటీవల రిలీజ్ చేశారు కూడా. దాన్ని చూసిన ఓ నెటిజన్ ‘వాటర్ మార్క్ లేకుండా పోస్టర్ పోస్ట్ చేయండి’ అని కోరాడు. అలాగే టి-సిరీస్ సౌత్, భద్రకాళీ పిక్చర్స్ సినిమా నిర్మాణ సంస్థ ట్విటర్ ఖాతాలను ట్యాగ్ చేశాడు. అక్కడే పైన చెప్పిన చర్చ అంతా జరిగింది. తొలుత ఆ ట్వీట్‌కు టీ సిరీస్ సౌత్ టీమ్ రియాక్ట్ అవ్వగా… దానికి ‘యానిమల’ టీమ్ స్పందించింది.
నెటిజన్ ట్వీట్‌కు (Animal) యానిమల్ హ్యాండిల్ ‘నీకు ఆ పిక్‌తో పనేంటి?’ అని సరదాగా అడిగింది. ఆ కామెంట్ చూసిన టీ సిరీస్ సౌత్ టీమ్ ‘ఆపరా సోది’ అంటూ కౌంటర్ వేసింది. అంతేకాదు ఆ నెటిజన్ను ఉద్దేశిస్తూ ‘హ్యాపీగా ఉండు బ్రో’ అంటూ ఒరిజినల్ పిక్ షేర్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం చూసిన నెటిజన్లు ‘బాగుందయ్యా మీ ట్వీట్ వార్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే డిసెంబరు 1న విడుదలై భారీ విజయం అందుకుంది. రూ. 835 కోట్లకుపైగా వసూళ్లను సాధించి దూసుకుపోతోంది.