Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

  • December 14, 2023 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

2023 క్లైమాక్స్ కి చేరుకున్నాం. ఇంకో పెద్ద సినిమా ‘సాలార్’ రిలీజ్ కి రెడీగా ఉంది. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కూడా రిలీజ్ కావాలి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ ఏడాది జనవరి నుండి మొదలుకొని ప్రతి నెల ఓ పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది. జనవరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ , ఫిబ్రవరిలో ధనుష్ ‘సార్’ , మార్చిలో నాని ‘దసరా’, ఏప్రిల్ లో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, రవితేజ ‘రావణాసుర’.. ఇలా ప్రతి నెలలో ఒక పెద్ద సినిమా పడింది. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలు కూడా ఈ ఏడాది రెండేసి సినిమాలు రిలీజ్ చేశారు. రవితేజ నుండి కూడా ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి 2 సినిమాలు వచ్చాయి. ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’ ‘సలార్’ వంటి రెండు సినిమాలు ఇచ్చాడు అని చెప్పాలి. కానీ కొంత మంది స్టార్ హీరోలు మాత్రం ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. వాళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) మహేష్ బాబు :

2022 లో ‘సర్కారు వారి పాట’ తో అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తర్వాతి సినిమా ‘గుంటూరు కారం’ కోసం చాలా టైం తీసుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అనేక కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఫైనల్ గా 2024 జనవరి 12 న ఈ సినిమా విడుదల కాబోతుంది. కాబట్టి 2023 లో మహేష్ బాబు నుండి సినిమా రాలేదు.

2) అల్లు అర్జున్ :

‘పుష్ప'(ది రైజ్) తర్వాత ‘పుష్ప 2′(ది రూల్) కోసం చాలా టైం తీసుకున్నాడు అల్లు అర్జున్. ఫలితంగా 2022 తో పాటు 2023 లో కూడా అతని సినిమా రాలేదు. ‘పుష్ప 2’ సినిమా 2024 ఆగస్టు 15 న రిలీజ్ కాబోతుంది అని దర్శకుడు సుకుమార్ అండ్ టీం ఎప్పుడో ప్రకటించారు.

3) ఎన్టీఆర్ :

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుండి మరో సినిమా రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘దేవర’ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. కాబట్టి.. 2023 లో ఈ సినిమా రాలేదు. మొదటి భాగాన్ని 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.

4) రాంచరణ్ :

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాంచరణ్ ‘ఆచార్య’ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. కానీ 2023 లో అతని నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ నత్త నడకన సాగుతుంది.

5) నాగార్జున :

2022 చివర్లో వచ్చిన ‘ఘోస్ట్’ తర్వాత నాగార్జున నుండి మరో సినిమా రాలేదు. ‘నా సామి రంగ’ సినిమా కోసం నాగార్జున చాలా గ్యాప్ తీసుకున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

6) వెంకటేష్ :

2022 లో ‘ఎఫ్ 3’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ తన 75 వ సినిమా కోసం చాలా టైం తీసుకున్నారు. ఫైనల్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైందవ్’ చేశారు. వాస్తవానికి ఇది ఈ ఏడాది డిసెంబర్లోనే రావాలి.. కానీ ‘సలార్’ సినిమా వల్ల 2024 జనవరి 13న రాబోతుంది. అలా వెంకీ నుండి కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు.

7) శర్వానంద్ : 

2022 లో శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ హిట్ అయ్యింది. ఆ తర్వాత తన 35వ సినిమా కోసం శర్వానంద్ కొంచెం టైం తీసుకున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు కానీ అది ఎందుకో లేట్ అవుతుంది. అలా 2023 లో శర్వానంద్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.

8) రానా :

‘విరాటపర్వం’ తర్వాత రానా కూడా ఇంకో సినిమా చేయలేదు. నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాలో చిన్న క్యామియో ఇచ్చాడు. కానీ రానా ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన సినిమా ఏమీ కూడా ఈ ఏడాది రాలేదు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే సినిమా చేస్తున్నాడు రానా.

9) అల్లు శిరీష్ :

గతేడాది ‘ఊర్వశివో రాక్షసివో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్ కూడా ఈ ఏడాది ఇంకో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయలేకపోయాడు.

10) సూర్య, కమల్ హాసన్, ‘కె.జి.ఎఫ్’ యష్:

వీళ్ళు మాత్రమే కాదు తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న సూర్య, కమల్ హాసన్, ‘కె.జి.ఎఫ్’ యష్ వంటి పక్క బాషా హీరోల (Star Heroes ) నుండి కూడా 2023 లో ఒక్క సినిమా కూడా రాలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #mahesh

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

11 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

13 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

14 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version