Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బాలయ్య ‘భానుమతి గారి మొగుడు’ గురించి ఆసక్తికర విషయాలు..!

బాలయ్య ‘భానుమతి గారి మొగుడు’ గురించి ఆసక్తికర విషయాలు..!

  • November 19, 2022 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య ‘భానుమతి గారి మొగుడు’ గురించి ఆసక్తికర విషయాలు..!

నందమూరి బాలకృష్ణ కెరీర్ స్టార్టింగ్‌‌లో, సోలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో, కుటుంబ కథాచిత్రాలతో పాటు మాస్ ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ముఖ్యంగా 1980, 90ల కాలంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు. బాలయ్యతో ఫ్యామిలీ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రం చేయాలని నిర్మాత డి.వి.యస్.రాజు అనుకున్నారు. విజయ్ కాంత్, రాధిక జంటగా.. పి.కళైమణి దర్శకత్వంలో తెరకెక్కి విజయం సాధించిన ‘తెర్కతి కల్లన్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో బాలయ్య, విజయ శాంతి నాయకా నాయికలుగా..

డీవీఎస్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ మీద నరసరాజు నిర్మాణంలో వచ్చిన సినిమా .. ‘భానుమతి గారి మొగుడు’..ఎ.కోదండ రామి రెడ్డి దర్శకుడు. 1987 నవంబర్ 19న విడుదలైన ఈ యాక్షన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2022 నవంబర్ 19 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. మొదటి ఆట మొదలు ప్రేక్షకాభిమానుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా భార్యభర్తల బంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి..

బాలయ్య, విజయ శాంతిల జోడీ, క్యారెక్టర్లు, డైలాగులు, పాటలు, నేపథ్య సంగీతం..ఇలా ప్రతీది ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.. పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేశారు. అశ్విని, రంగనాథ్, విజయ నిర్మల, గిరిబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. చక్రవర్తి కంపోజ్ చేసిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.. బాలయ్య సోదరుడు నందమూరి మోహన కృష్ణ ఈ సినిమాకి కెమెరా మెన్.. ఈ శతదినోత్సవ వినోదాత్మక చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది.

బాలయ్యను ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గర చేసింది. కామెడీ టైమింగ్, డ్యాన్సుల్లో సరికొత్తగా కనిపించాడు బాలయ్య. ‘భానుమతి గారి మొగుడు’ అనే టైటిల్‌కి మహిళా ప్రేక్షకులంతా కనెక్ట్ అవడం పెద్ద ప్లస్ అయింది. దాంతో, బాలయ్య, విజయ శాంతి, కోదండ రామి రెడ్డి కాంబినేషన్‌లో సూపర్ హిట్ ఫిలింగా నిలిచింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Kodandarami Reddy
  • #Balakrishna
  • #Bhanumati Gari Mogudu
  • #Vijayashanti

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

7 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

10 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

8 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

9 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

11 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version